Flaxseed Oil : అవిసె నూనెతో ఎనలేని ప్రయోజనాలు… చర్మ – జుట్టు సంరక్షణకు దివ్య ఔషధం…!
ప్రధానాంశాలు:
Flaxseed Oil : అవిసె నూనెతో ఎనలేని ప్రయోజనాలు... చర్మ - జుట్టు సంరక్షణకు దివ్య ఔషధం...!
Flaxseed Oil : అవిసె గింజలను Flaxseed Oil ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు కొవ్వులు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒలిక్ యాసిడ్ , లినోలిక్ యాసిడ్, మరియు ఆల్ఫా లినోలేనీక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇది నూనెలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. కాబట్టి వంటలు ఉపయోగించే ఇతర నూనెల కంటే అవిసె గింజలతో తయారుచేసిన నూనె ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా అవిస గింజల నూనెలో ఒమేగా-3 యాసిడ్స్ అధిక మోతాదులో ఉన్నందున రక్తపోటు గుండె ఆరోగ్యానికి ఇది చాలా సహాయపడుతుంది. అలాగే మధుమేహం మరియు కీళ్ల నొప్పులను నియంత్రణలో ఉంచుతుంది. ఇతర పోషక విలువలు కూడా అధిక మోతాదులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నూనెలో ఫైబర్ పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల ను తగ్గిస్తుంది. ఎముకల బలానికి అవిసే గింజలు లోని లిగ్నాన్స్, ఈస్ట్రోజెన్స్ ఉపయోగపడతాయీ. అలాగే శరీరంలో వేడి చేయకుండా ఉండేందుకు ఈ నూనె తీసుకోవచ్చు. అలాగే అవిసె గింజలను పొడిలా చేసుకుని వండిన కూరలపై చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పొడిని రొట్టెల పిండిలో కూడా కలిపి తీసుకోవచ్చు.
ఇక ఈ అవిసె నూనె ను వంటకాలలో వినియోగిస్తే ప్రోస్టేట్ ,పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. అయితే ఈ అవిసే నూనె వేడి చేస్తే దానిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి ఈ నూనె వినియోగించాలి అనుకునేవారు కచ్చితంగా వంట పూర్తయిన తర్వాత చివర్లో వంటపై చల్లడం ఉత్తమం.