Guava : ఒక్క జామపండు10 ఆపిల్స్ తో సమానం… ఇంకా ఎన్నో లాభాలు..!
Guava : మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉండే దానిపైన నుండి వచ్చే పండ్ల పైన అంతగా దృష్టి పెట్టలేరు మనవాళ్ళు. చాలామంది ఏదైతే చవకగా దొరుకుతుందో దాన్ని అస్సలు పట్టించుకోరు. ఏదైతే చాలా ఖరీదుగా ఉంటుందో దాని వెంట పడుతుంటారు. విలువ ఎక్కువగా ఉంటే అబ్బా దీన్ని అనవసరంగా ఎన్ని రోజులు మిస్ చేసుకున్నాం కదా అనుకుంటాము. అలాంటి వాటిలో మన పెరటిలో ఉండే పండ్లలలో మొదటిగా ఉండేది జామపండు ఒకటే. దీనిలో ఉండే పోషకాలు మనకు మరి ఏ ఇతర పండ్లు ఇవ్వదు అని చెప్పొచ్చు.
మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.. ఈ పండులో పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి..కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు జామ పండు తింటే చాలా మంచిది. మలబద్ధకం, డయేరియా, దగ్గు, జలుబు లాంటి వ్యాధులను తగ్గించడానికి జామపండు కీలక పాత్ర పోషిస్తుంది.. వీటితోపాటు విటమిన్ సి ఈ పండులో పుష్కలంగా ఉన్నందున రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ పండులో విటమిన్ ఏ కలిగి ఉన్నందున కంటిచూపుని మెరుగుపరుస్తుంది. జామపండు తినడం వల్ల మలబద్ధకం చాలా వరకు తగ్గుతుంది. షుగర్ ఉన్నవారికి జామపండు చాలా మంచిది. కమల పండులో దొరికే విటమిన్ సి కన్నా జామ పండులో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది.
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ఉత్తమం అంటారు కదా.. ఆకుకూరల్లో దొరికే పీచు కంటే జామలో రెండు రెట్లు ఎక్కువగా దొరుకుతుంది. ఆపిల్ లో ఉండే పీచు పదార్థం కంటే జామలో చాలా అధికంగా ఉంటుంది. పది ఆపిల్స్ లో ఉండే పోషకాలు ఒక్క జామకాయలలో మాత్రమే ఉంటాయి. అలాగే జామ పండ్లు తక్కువ ధరకు వస్తాయి.. కాబట్టి తక్కువ ధరకు దొరికే జామ పండ్లను అందరూ తింటూ ఆరోగ్యంగా ఉండండి..