Raisins : కిస్ మిస్ లు నానబెట్టుకుని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raisins : కిస్ మిస్ లు నానబెట్టుకుని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Raisins : కిస్ మిస్ లు నానబెట్టుకుని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Raisins : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు చాలా అవసరం. ప్రతిరోజు సరియైన ఆహారాన్ని తీసుకుంటే మన శరీరం పోషకాలు లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో నానబెట్టిన కిస్మిస్లను తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు… అయితే నానబెట్టిన కిస్ మిస్ లు తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా నానబెట్టిన కిస్మిస్ తీసుకుంటే శరీరంలోని రక్తహీనత తగ్గుతుంది.

కిస్మిస్ లో హిమోగ్లోబిన్ పెంచి ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కిస్మిస్లను నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కిస్మిస్ లలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇది శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది. నానబెట్టిన కిస్మిస్లను ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం నుండి కరమైన కొలెస్ట్రాల్ను కలిగిస్తుంది. బలహీనమైన ఎముకలు లేక కండరాల నొప్పులు ఉన్నట్లయితే ప్రతిరోజు నానబెట్టిన కిస్మిస్లను తీసుకోవాలి. ఈ కిస్మిస్ లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే మీ ఎముకలు బలోపితం చేయడానికి ఉపయోగపడుతుంది.

నానబెట్టిన కిస్మిస్లు తినడం వలన మలబద్ధక సమస్య నుంచి మంచి ఉపశమనంకలుగుతుంది..నానబెట్టిన కిస్మిస్ ను ఖాళీ కడుపుతో తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు రోజు 8 నుంచి 10 నానబెట్టిన కిస్మిస్లను తీసుకోవాలి. ఇందులో పీచు, పొటాషియం అధికంగా ఉండడం వల్ల బిపిని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగ పడుతుంది.. నానబెట్టిన కిస్మిస్లను ఉదయాన్నే తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఎందుకంటే నానిన కిస్మిస్లో విటమిన్లు కనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది