Health Benefits : ఈ ఆయుర్వేద రసంతో… ఈ సమస్యలన్ని మటుమాయం… కేవలం మూడు ఆకులు చాలు…
Health Benefits : ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి సంబంధించి పలు చికిత్సలు అనుసరిస్తుంటారు. ఈ కాలంలో కూడా కొంతమంది ప్రజలు ఆయుర్వేద చికిత్సలను ఫాలో అవుతుంటారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఆయుర్వేదంలో నయం చేయలేను వ్యాధులంటూ ఏమీ లేవు. అన్నింటిని ఆయుర్వేదం ఎదుర్కొంటుంది. ఈరోజుల్లో మారుతున్న వాతావరణం కారణంగా వైరల్ బారిన పడితే అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కోలుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తిలో శరీరంలో బలహీనత కొనసాగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ప్రజలు తమ రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాలి. దీనికోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.
ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కొన్ని రకాల రసాలను పరిచయం చేశారు. వాటిలో కొన్ని అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. వేప, తులసి, తిప్పతీగ రసం శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటితో చేసుకున్న రసం త్రాగడం వలన జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. తరచూ ప్రజలు వాటిని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తారు. అయితే వాటిని కలిపి తాగడం వలన మరింత లాభదాయకంగా ఉంటుంది. ఇది వ్యాధులకు పోరాడడానికి శరీర సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. అంతేకాకుండా వైరల్ వ్యాధుల ప్రభావాన్ని మరింత తగ్గిస్తుంది.
వేప, తులసి, తిప్పతీగ రసం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని రక్తంలో చక్కెర సాయిని నియంత్రించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల వల్ల ఇబ్బంది పడేవారు ఈ ఆయుర్వేద రసాన్ని తీసుకుంటే మంచి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మూడింటి రసం కడుపు కాలేయానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు కాలేయం రెండింటిని బలోపేతం చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ రసంలో యాంటీఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన కాలేయం దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. ఉదయం పరిగడుపున వీటిని తీసుకోవడం వలన మరింత ప్రయోజనం కలుగుతుంది.