Turmeric Oil : పడుకునే ముందు ఈ నూనె రాస్తే చాలు… మచ్చలు, మొటిమలు ఇట్టే పోతాయి…!
ప్రధానాంశాలు:
Turmeric Oil : పడుకునే ముందు ఈ నూనె రాస్తే చాలు... మచ్చలు, మొటిమలు ఇట్టే పోతాయి...!
Turmeric Oil : పసుపుని వంటల్లో వాడతారు. దీనిని ముఖానికి రాయటం వలన కూడా కాంతివంతంగా మారుతుంది. పసుపు మీ చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. ఈ పసుపుతో నూనెను కూడా తయారు చేస్తారు. దీని వలన చర్మానికి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పసుపు నూనెలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి ఉండటంతో అందాన్ని పెంచుతాయి…
Turmeric Oil చర్మ సమస్యలకి పరిష్కారం
పసుపు నూనెలో కర్కుమీన్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్ శోథ నిరోధక సమ్మేళనం. పసుపు నునే చర్మానికి గనక అప్లై చేసినట్లయితే మొటిమలు మరియు తామర, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. దీనితో పాటు వాపు, ఎరుపు సమస్యలు కూడా తగ్గుతాయి..
Turmeric Oil యాంటీ ఆక్సిడెంట్స్
ఈ నూనె యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేస్తాయి. చర్మ కణాలకి కూడా ఆక్సీకరణ నష్టం జరగకుండా చూస్తుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. గీతలు, ముడతలు, మచ్చల్ని కూడా దూరం చేయగలదు. దీనితో పాటుగా చర్మం యవ్వనంగా కూడా మారుతుంది…
Turmeric Oil మాయిశ్చరైజింగ్
పసుపు నూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణాన్ని అందించి హైడ్రేట్ చేస్తాయి. దీని వలన స్కిన్ మృదువుగా, హైడ్రేట్ గా ఉంటుంది. దీని వల్ల చర్మం కూడా ఎంతో అందంగా మారుతుంది…
Turmeric Oil మొటిమలకి చెక్
పసుపు నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రో బయాల్ లక్షణాలు ఉంటాయి. మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడం లో కూడా ఇది ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తున్నది. సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేయగలదు. దీనిని రాయడం వలన చర్మ రంధ్రాలు, బ్రేక్ అవర్స్ తగ్గుతాయి. పసుపును నునే ను రెగ్యులర్ గా అప్లై చేయటం వల్ల చర్మం అనేది క్లియర్ కాంతివంతంగా మెరుస్తుంది.
Turmeric Oil చర్మ రంగు
ఈ పసుపు నూనెలో చర్మాన్ని కాంతవంతంగా మార్చే గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై డార్క్ స్పోట్స్, పిగ్మెంటేషన్ మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఎందుకు అంటే. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. కావున దీని వల్ల చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది…