Water Apple : వామ్మో.. వాటర్ యాపిల్ తినడం వలన ఇన్ని ఉప‌యోగాలా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Water Apple : వామ్మో.. వాటర్ యాపిల్ తినడం వలన ఇన్ని ఉప‌యోగాలా..?

 Authored By aruna | The Telugu News | Updated on :25 July 2023,9:00 am

Water Apple : ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం.. అలాంటి పండ్లలో చాలామందికి తెలియని పండు వాటర్ ఆపిల్. ఇది గులాబీ రంగులో ఉండటం వల్ల చూస్తే ఎవరైనా కూడా జీడి మామిడి పండు అని కూడా అనుకుంటారు. ఎందుకంటే జీడి మామిడి కింద జీడిగింజ ఉంటుంది. ఈ పంట భారత దేశంలో ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు ఆపిల్ ఏంటి ఇది మేమెప్పుడూ వినలేదే.. చూడలేదు అంటే ఈ సీజన్లో ఈ పండ్లు వస్తాయి. డిసెంబర్, జనవరిలో ఈ వాటర్ ఆపిల్ పండు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇది మనం గ్రామాల్లో చెట్టు పెంచ్చుకోవచ్చు ఈ మొక్కలు నర్సరీలలో దొరుకుతాయి. అంట్లు దొరుకుతాయి. మొక్కలు దొరుకుతాయి. ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. చెట్టుకి 500 నుంచి 1000 పండ్లు కూడా కాస్తాయి.. దీనికి విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంది. కాల్షియం ఉంది. విటమిన్ బి వన్ ఉంది.

విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి.ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటర్ యాపిల్ కి. మొట్టమొదటిది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ,ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయవ్యాధి, టీవీ స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డకట్టుకునే నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.వైరస్ల వల్ల సంక్రమించే వ్యాధులను అడ్డుకట్ట వేస్తుంది. గ్యాస్ ట్రబుల్ నివారిస్తుంది. ఇది దీనిలో పీచు ఉంటుంది. పీచు వల్ల దీన్ని పైన ఉన్న తోలు తో సహా తినాలి. కోస్తే లోపల గింజ ఉండదు.. తోలుతో సహా కండ కూడా తినొచ్చు. రుచి కూడా బానే ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారికి మొలలు మూలశంక పైల్స్ వచ్చే అవకాశం ఉంది.

health benefits of water apple in telugu

health benefits of water apple in telugu

ఇలాంటి సమస్య కూడా తగ్గుతుంది. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కావున ఈ పండు కనిపిస్తే వదలకండి. కొనండి తినండి.. లేదా పండ్ల దుకాణానికి గాని ఫ్రూట్ మార్కెట్ కి వెళ్లి వాటర్ యాపిల్ అడిగి కొని తినండి. ఈ మొక్కను తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఒక మూడు సంవత్సరాల్లోనే మనకి ఇది కాపుకు వచ్చేస్తుంది. మన ఇంట్లోనే మన నేలలకి అనుకూలమైన చెట్టు ఇంటి ప్రాంగణంలోనే వాటర్ యాప్ ల్ చెట్టుని పెంచుకొని ఇవి పండ్లు కాసినప్పుడల్లా తినడం ద్వారా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది