International Yoga Day : యోగాలో ముఖ్య‌మైన‌ ఆస‌నాలు … వాటి వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

International Yoga Day : యోగాలో ముఖ్య‌మైన‌ ఆస‌నాలు … వాటి వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ?

 Authored By aruna | The Telugu News | Updated on :21 June 2021,6:01 pm

International Yoga Day 2021 :  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పోందుతు ఆస‌నాలు పెరుగుతూ వ‌స్తున్న యోగా మ‌న ఇండియాలో క‌నుగోన్నారు . ఈ యోగాలో కీల‌క ఆస‌నాలు ఉన్నాయి. మ‌నం మందుల‌తో న‌యంచేయ‌లేని రోగాల‌ను ఈ యోగా ఆస‌నాలు చెయ‌డం వ‌ల‌న న‌య‌మ‌వుతాయి . మ‌నిషి చెయ‌గ‌లిగే అత్యుత్త‌మ ఆస‌నాల‌లో యోగా ప్ర‌థ‌మ స్థానాన్ని సంపాధించుకొ గ‌లిగింది .

అన్ని వ్యాయామాలలో కెల్లా యోగానే చాలా ప్ర‌త్యేక‌త‌ను కలిగి ఉంది . ఎందుకంటే యోగా కేవ‌లం మ‌న శ‌రిరంకు మాత్ర‌మే కాదు మ‌న యొక్క మేద‌డ‌ను మ‌రియు ఆత్మ‌ను శుధ్ధి చెయ‌డానికి చాలా మ‌ఖ్య‌పాత్ర‌ను వ‌హిస్తుంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ను ఎదురుకొవ‌డానికి ఎన్నో ఆహ‌ర‌ప‌దార్ధాలు తిన‌డం ద్వారా ఇమ్యునిటిని పెంచుకొవ‌చ్చ‌ని తెలుసుకున్నాము . కాని యోగా ఆస‌నాలు వ‌ల‌న కూడా మ‌నం ఇమ్యునిటిని పెంచుకొవ‌చ్చు. యోగా వ‌ల‌న మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే యోగాలో కొన్ని కీల‌క ఆస‌నాలు మ‌రికొన్ని తెలిక‌పాటి ( సింపుల్ ) ఆస‌నాలు ఉంటాయి . ఈ ఆస‌నాల‌ను ప్ర‌తి రోజు చేస్తు వ‌స్తే క‌ష్ట‌మైన ఆస‌నాల‌ను కూడా చాలా తెలిక‌గా చెయ‌వ‌చ్చు. కాళ్ళు, చేతులు యోగాకు అనుకూలంగా మ‌ర్చుకొవ‌డానికి విలుగా ఉంటుంది . అస‌లు యోగా ఎన్ని ర‌కాలు , ఎవ్వ‌రెవ్వ‌రు ఈ ఆస‌నాలు వేస్తే మంచిది, ఎలంటి ఆస‌నాలు వేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి . ఎలంటి ఆస‌నాలు ఆస‌నాలు సుల‌భంగా వెయ‌వ‌చ్చు అనేది తెలుసుకుందాం …..

హ‌స్త‌పాదాస‌నం : హ‌స్త‌పాదాస‌నం లో ఒక భాగంగా మీరు ముందుగా నిటారుగా నిల‌బ‌డాలి . మీ శ‌రిర బ‌రువును రెండు పాదాల‌కు స‌మానంగా బ్యాలెన్స్ చేసుకొవాలి . ముందుగా బాగా ఊపిరిని పీల్చుకోండి . త‌రువాత మీ చేతుల‌ను ఓవ‌ర్ హెడ్డ్ వ‌ర‌కు విస్త‌రింపజేయండి. ఇప్పుడు నెమ్మ‌దిగా ఊపిరిని పీల్చుకుంటూ . పాదాల‌వైపు ముందుకు కింద‌కు బెండ్ అవ్వాలి . ఈ భంగిమ‌లో 20 నుండి 30 సెక‌న్ల పాటు ఉండి. లోతైన శ్వాస తిసుకొండి. ఆ త‌రువాత మీ కాళ్ళు మ‌రియు వెన్నుముక నిటారుగా ఉండే విధంగా ఉంచాలి . ఇలా ప్ర‌తిరోజు చేయ‌డంవ‌ల‌న మీకు ఒత్తిడి త‌గ్గి మీ మెద‌డు చాలా చురుకుగా ప‌నిచెస్తుంది . మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది.

వృక్షాస‌నం : ఇది చాలా తెలిక‌పాటి ( సింపుల్ ) యోగా ఆస‌నంలో ఈ వృక్షాస‌నం ఒక‌టి . మీ మ‌న‌సును చాలా ప్ర‌శాంతంగా ఉంచుకొని ఈ ఆస‌నంను ప్రారంభించండి . మీరు ఇటువంటి ఆస‌నంను చేసే ముందు మీ క‌డుపు ( ఉద‌రం )
ఖూలిగా ఉండాలి . అప్పుడే మీ బ‌రువు త‌గ్గ‌టానికి ఎక్కువ‌ అవ‌కాశం ఉంటుంది. ఈ ఆస‌నం ఒంటి కాలి పై నిల‌బ‌డి .
మీ రెండు చేతులు పైకెత్తి న‌మాస్కారం చేస్తునట్లు ఉండాలి . ఇది మీకు చేయ‌గ‌లిగే శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు చేయండి. దినిని వృక్షాస‌నం అంటారు . ఇది అధిక బ‌రువు త‌గ్గ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది.

భుజంగాస‌నం : ఈ ఆస‌నంను మీ రెండు అర‌చేతుల‌ను భూమి పై ఉంచి . త‌రువాత మీ చాతిని పైభాగంలో ఉంచి గాలిని పీల‌స్తూ త‌ల‌ను నెమ్మ‌దిగా చాతిని పైకెత్తాలి . 10 నుండి 20 నిముషాల పాటు ఇలా గాలిని పీలుస్తూ , వ‌దులుతూ నెమ్మ‌దిగా తిరిగి య‌థాస్థానానికి రావాలి. ఇలా ప్ర‌తిరోజు మీ శ‌క్తిమేర‌కు చేయాలి . ఇలా చేసిన త‌రువాత ఒక అర గంట పాటు విశ్రాంతి తీసుకోవాలి . ఈ ఆస‌నం ప్ర‌తి రోజూ చెయ‌డం వ‌ల‌న మీ శ‌రిరంలో పెరుక‌పోయిన చెడు కొవ్వును సుల‌భంగా క‌రిగించివేస్తుంది. స్త్రీ ల‌లో గ‌ర్భాశ‌యంలోని గ‌డ్డ‌ల‌ను క‌రిగిపోయేలా చేస్తుంది . గ‌ర్భాశ‌యంను శుభ్రం చేస్తుంది. మీ వ‌న్నుముక కూడా బ‌ల‌ప‌డుతుంది .

ధ‌నురాసం : ఈ ఆస‌నం చాలా క‌ష్టంగా ఉంటుంది . ఇది ధ‌న‌సు ( విల్లు, భాణం ) ఆకారంలో ఉంటుంది . కావునా దినిని
ధ‌నురాసనం అంటారు . దినిని ప్రారంభంలో అంద‌రు చేయ‌లేరు . ఒకేసారి పూర్తి ఆస‌నంను వెయ‌కుండా మొద‌ట తెలిక‌పాటి ఆస‌నంను వెయ‌డానికి ప్ర‌య‌త్నించండి . ఆ త‌రువాతే పూర్తి ఆస‌నంను చేరుకోవచ్చు. రాలేదు అని అనుకోకుండా మొద‌ట అర్ధధ‌నురాసంనం ప్ర‌య‌త్నించి త‌రువాత పూర్తి ఆస‌నంను చేయవ‌చ్చు. పోట్ట‌భాగం ( క‌డుపు ,
ఉధ‌రం) లోని అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ ఎక్క‌వ‌గా జ‌రుగుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌డం వ‌ల‌న ప్ర‌తి ఒక్క అవ‌య‌వాలు
చాలా ఆరోగ్యంగా ఉంచ‌డానికి ఈ ఆస‌నం ఉప‌యోగ‌ప‌డుతుంది .

ఒంటె భంగిమ : ఈ ఆస‌నం ఎలా చేయాలంటే మీ పోట్ట , న‌డుము , చాతి మ‌రియు భుజాల పై ఒత్తిడి పెంచాలి . ఇలా యోగా చేయ‌డం వ‌ల‌న మీ శ‌రిరం యొక్క బ‌రువును చాలా సుల‌భంగా త‌గ్గించుకోవచ్చు.

కోణాస‌నం : ముందుగా మీరు ఈ ఆస‌నంలో నిటారుగా నిల‌బ‌డాలి . ఆ త‌రువాత ఒక చేతిని పైకెత్తి . ఒక‌వైపుకు బెండ్
అవ్వాలి . అలా మీకు ఎంత‌సేపు విలైతే అంత‌సేపు చేయండి . ఆ త‌రువాత మీ రెండు చేతులు పైకెత్తి జోడించండి . అప్పుడు మీ శ‌రిరంను ఓ వైపుకు వంచాలి . ఇలా చెయ‌డంవ‌ల‌న మీకు అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

 

ఇది కూడా చ‌ద‌వండి ==> హై బీపీ మీమ్మ‌ల‌ని బాగా ఇబ్బంది పెడుతూందా.. అయితే మీరు ఇవి తిన‌డంలేద‌ని అర్ధం..?

ఇది కూడా చ‌ద‌వండి ==> హై బీపీ మీమ్మ‌ల‌ని బాగా ఇబ్బంది పెడుతూందా.. అయితే మీరు ఇవి తిన‌డంలేద‌ని అర్ధం..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Diabetes : మీకు షుగ‌ర్ వ్యాధి ఉందా.. అయితే ఈ ఆహ‌రాల‌ను తిన‌డం మానుకొవాల్సిందే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Covid Nails : క‌రోనా మీకు వ‌చ్చి వెళ్ళింద‌ని మీ గోర్లె చెబుతాయి .. ఒక్క సారి చెక్ చెసుకొండి ?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది