Health Benefits : నోటి ద్వారా కూడా గుండెపోటు రావచ్చు… ఎలా గుర్తించాలి… నివారణ ఎలా…
Health Benefits : ఈమధ్య గుండె జబ్బులు బాగా పెరుగుతున్నాయి. ఆడ, మగ మరణాల రేటు పెరుగుతుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దంత మరియు నోటి సమస్యల ద్వారా కూడా గుండె జబ్బులు వస్తాయంట. ఇటీవల అధ్యయనాలు ఇలా కూడా గుండె జబ్బులు వస్తాయని పేర్కొన్నారు. ఒక్క యుఎస్ లోని ఏట 6.5 మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ఇలా పెరుగుతున్న గుండె జబ్బులను నివారించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజువారి వ్యాయామం, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలి.ఈ మధ్యన కొన్ని అధ్యయనాలు దంతా మరియు నోటి సమస్యలు మరియు గుండె జబ్బులు మధ్య సంబంధాన్ని సూచించాయి.
సాధారణంగా శరీరంలో అన్ని రకాల ఇన్ఫెక్షన్లు తీవ్రంగా మారినప్పుడు గుండెకు హాని కలిగిస్తాయి. అదేవిధంగా ఈ నోటి సమస్యలు కూడా గుండె జబ్బులకు కారణం అవుతాయి. కాని దాని గురించి మంచి విషయం ఏంటంటే ఇది ఇతర లక్షణాల వలె లేదు. జాగ్రత్తగా ఉంటే దంతా, నోటి సమస్యలను నివారించవచ్చు. గుండె జబ్బులలో కూడా అనేక రకాల గుండె జబ్బులు ఉన్నాయి. కరోనరీ వ్యాధులు, గుండె పోటు, కార్డియాన్ అరెస్ట్ వంటి అనేక వ్యాధులు ఉన్నాయి. డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటుతో సహా అనేక గుండె జబ్బులు ప్రారంభ లక్షణాలు లేకుండా కనిపిస్తాయి.
గుండె జబ్బులను నివారించాలంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నోటి ఆరోగ్యం. లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజువారి వ్యాయామం, తగినంత విశ్రాంతి మరియు నిద్రను అనుసరించడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలను నివారించవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలు మన రోజువారి ఆహారంలో చాలా సాధారణం అయిపోయాయి. అలాగే వ్యాయామం తగ్గిపోయింది, శరీరానికి శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గుండె జబ్బులు అనేటివి వస్తుంటాయి. సరైన ఆహారాన్ని తీసుకుంటూ, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఈ నోరు మరియు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చేయడం వలన శరీరానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.