Health Benefits : ఈ ఆకుతో వెయిట్ లాస్ వెరీ సింపుల్.. ఈ కషాయం తాగండి వెంటనే రిజల్ట్
Health Benefits : ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో పాటు ఒత్తిడి, జంక్ ఫుడ్ వంటి అలవాట్లు అధిక బరువుకు కారణాలుగా చెప్పవచ్చు. ఎన్ని వ్యాయామాలు చేసినా, ఆహారంలో మార్పులు చేసుకున్నా సరే.. కొన్నిసార్లు బరువు తగ్గడం కష్టతరం అవుతుంది. కొంతమందిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి (బెల్లీ ఫ్యాట్) సమస్యను మరింత కఠినం చేస్తుంది. ఆకలి లేకుండానే తినే ఆహారం శారీరక, మానసిక ఒత్తిడికి దోవతీస్తుంది. పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే పోషకాహార లేమి సంబంధిత వ్యాధులు వస్తాయి.మసాలా దినుసులలో బిర్యానీ ఆకులకు ప్రత్యేక స్థానముంది.
వీటినే ఇంగ్లీష్‌లో బే లీవ్స్, హిందీలో తేజ్ పత్తీ అని పిలుస్తారు. నాన్ వెజ్ వంటకం ఏది వండినా బిర్యానీ ఆకు పడాల్సిందే. దాదాపు ప్రతి ఒక్కరి కిచెన్‌లో బిర్యానీ ఆకు ఉంటుంది. ఇది వంటకాలకు ప్రత్యేకమైన రుచిని, సువాసనను తీసుకొస్తుంది. ఐతే కేవలం రుచిని ఇవ్వడమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.రాగి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్ బే ఆకులో పుష్కలంగా ఉ:టాయి. ఇవి అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు బే ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.
Health Benefits : బే ఆకుల్లో పోషకాలెన్నో..
ఇది రక్తం గడ్డకట్టడం, చర్మ సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఔషధ గుణాలున్న బిర్యానీ ఆకుతో డికాక్షన్ చేసుకొని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కషాయాన్ని రోజూ తాగితే అనేక వ్యాధులు దూరమవుతాయి.శరీరంలో నొప్పులకు బిర్యానీ ఆకుల డికాక్షన్ చక్కగా పనిచేస్తుంది. శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పిగా అనిపిస్తే.. బిర్యానీ ఆకులను కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు. దీన్ని తీసుకోవడంవ వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రిలాక్స్‌గా అనిపిస్తుంది. వెన్నునొప్పికి బే ఆకుల కషాయాన్ని రోజుకు కనీసం రెండుసార్లు తాగాలి. అలాగే బే ఆకు నూనెతో నడుముపై మసాజ్ చేయాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.