ఇది కేవలం పురుషులకే… కిస్మిస్, పెరుగు కలిపి రోజూ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
వేసవికాలం వచ్చిందటే చాలు ఎండలు బాగా మండిపోతాయి. ముఖ్యంగా మే నెలలోనైతే భానుడు భగ భగమని నిప్పులు కురిపిస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు మనకు దాహం తీరక శీతల పానియాలను తాగాలనిపిస్తుంది. ఈ సీజన్ లో వచ్చే పండ్లను అంటే మమిడి కాయలను, పుచ్చకాయలను, ఇంకా ఇలాంటివి ఎన్నో ఆహరపదార్ధాలను తినాలనిపిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని వేడిని తగ్గించి ఎల్లప్పుడు బాడీని చల్లగా ఉంచడానికి పెరుగు, కిస్మిస్ ( ఎండు ద్రాక్ష, dried grape) ఈ రెండింటినీ కలిపి ఒక రెసిపీని తయారుచేసుకోని తినడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెసిపీ వల్ల మంచి ఆరోగ్యంతో పాటు శారీరక బలహీనత తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా పురుషులలో ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిస్మిస్ ( ఎండు ద్రాక్ష ) ప్రయోజనాలు
కిస్మిస్ లో అధికంగా పోషక విలువలు ఉంటాయని చెప్పొచ్చు. అవి ప్రోటిన్, ఐరన్, మినరల్స్, పిండిపదార్థాలు, పైబర్, సోడియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
ఎండు ద్రాక్షలో విటమిన్ -బి , B1, B2, B3 ,B6, B9 , విటమిన్-E , విటమిన్-C, విటమిన్-K, మంచి కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. దీనిలో పీచు పదార్దాలు కూడా అధికంగా ఉంటాయి
పెరుగు వలన ప్రయోజనాలు :
పెరుగులో విటమిన్ – A, విటమిన్ -C, కార్భోహైడ్రెట్లు, చక్కెరలు, కాల్షియం, రైభోప్లావిన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పాల నుండి పెరుగును, పెరుగు నుంచి వెన్నను, వెన్న నుంచి నెయ్యిని తయారు చేస్తారు.
ఎండు ద్రాక్ష, పెరుగు మిశ్రమాన్ని ఎలా తయారుచేయాలి
మొదట కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పాలను తీసుకోని వేడి చేసి చల్లారనివ్వాలి. ఆ తరువాత దానిలో కొంచం పెరుగుని వేసి దాంతో పాటు ఎండు ద్రాక్షని కూడా వేసి కలపాలి, ఈ మిశ్రమాన్ని 6 గంటల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత అంటే పాలు పెరుగులా మారి గట్టిపడేంత వరకు అలాగే మిశ్రమాన్ని ఉంచాలి. ఆ తర్వాత దాన్ని తినేయడమే. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఇంట్లోనే తయారుచేసుకోవడం వలన మనకు వేసవికాలం తాపాన్ని తగ్గిస్తుంది.
మరి పురుషులకు ఎందుకు ప్రయోజనమంటే…?
ఈ మిశ్రమాన్ని తినడం వల్ల పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి ఎక్కువ అవుతుందట. శాస్రవేత్తల పరిశోధనలో ఇది రుజువు అయింది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హర్మోన్ ను కలిగి ఉన్న ఆహరపదార్థంగా ఎండు ద్రాక్షను పరిగణించారు. ఇది అనేక వ్యాదులనుంచి రక్షిస్తుంది. పురుషుల్లో లైంగిక సంబంధిత లోపాలు రానివ్వకుండా ఉండాటానికి ఎంతో దోహదపడుతుంది.ఈ మిశ్రమాన్ని ఆహరంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టిరియాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఎండు ద్రాక్ష ప్రతి రోజూ తినడం వల్ల కీళ్ళవాపుని , రక్తపోటు వంటి సమస్యల నంచి కూడా రక్షిస్తుంది.