Health Problems : ఈ రెండు నొప్పులకు తేడా తెలుసుకోండి.. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం
Health Problems : హార్ట్ ఎటాక్ లక్షణాలు, గ్యాస్ సమస్య వల్ల కలిగే ఛాతీనొప్పి ఇంచుమించూ ఒకేలా ఉంటాయి. కొందరు తీవ్ర నొప్పిగా ఉన్నా అంతా గ్యాసేలే అంటూ లైట్‌గా తీసుకుంటుంటారు. అది చాలా ప్రమాదకరం.. గ్యాస్ సమస్యే అయినా తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. కొందరికి గుండె పోటు పాతికేళ్లకే వస్తుంది. చాలా మంది స్టంట్స్ వేసుకుని తిరుగుతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది.సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, ఛాతీలో మంటగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. అయితే అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి.
కానీ టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేకపోతే కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాలి.గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది.కడుపు నిండుగా అనిపించడం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, మంట, అజీర్థి, వికారం వంటివి ఇబ్బంది పెడితే గ్యాస్ట్రిక్ సమస్యగా భావించాలి. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో రోగాలు వస్తున్నాయి. టైంకి తినకపోవడం, ఆయిల్ ఫుడ్, మసాలలతో నిండిన ఆహార పదార్థాలను తీసుకోవడం
Health Problems : గ్యాస్ట్రిక్ సమస్య అయితే..
వల్ల గ్యాస్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తున్నాయి.గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువైతే కడుపులో పుండ్లు, అల్సర్ కు దారితీస్తుంది. టైంకి తినకపోవడం వల్ల కడుపులో రసాయనాలు ఉత్పత్తి అయి జీర్ణాశయంలో, పేగులలో అల్సర్ కి దారితీస్తుంది.ఆహారాన్ని నమలకపోవడం, సోడాలను తాగడం, బబుల్ గమ్ లను నమలడం, కూల్ డ్రింక్ లను ఎక్కువగా తాగడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. ఒత్తిడి డీహైడ్రేషన్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో కడుపు మంట, ఉబ్బరం, అజీర్థి, వికారం, కొంతమందిలో మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైమ్స్ తక్కువగా ఉన్నప్పుడు, పిండి పదార్థాలు సరిగ్గా ఉడకనప్పుడు, యాంటిబయోటిక్స్ ను ఎక్కువ మొత్తంలో ఉపయోగించే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.