Health Problems : మీ చేతిగోళ్లు అలా ఉంటే ప్రమాదమే.. ఇప్పుడే చెక్ చేసుకోండి
Health Problems : సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే కొందరు నిపుణులు వైద్య పరీక్షలు లేకుండానే శరీరంలో తలెత్తే అనారోగ్య సమస్యలను సులభంగా గుర్తించవచ్చని చెబుతున్నారు. కాగా ఇలాంటి చిట్కాలను ఎక్కువమంది నమ్మకుండా కొట్టిపారేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి మనిషి చేతివేళ్ల గోళ్ల పై ఉన్న తెల్లటి మచ్చలు, గీతలు చూసి వారి ఆరోగ్య సమస్యలు చెపవచ్చుకొందరి చేతి వేలి గోర్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది.. ఈ సెమీ సర్కిల్ ను లునులా అంటారు.
లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్ధం.. కాగా గోరు మీద ఉండే ఈ లునులా ని చాలామంది పట్టించుకోరు.. కానీ ఈ లునులా మన శరీరంలో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి.. ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుంది అట. గోరు రంగును బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను కూడా తెలుసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.చేతి గోర్లపై లునులా లేకపోతే వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించవచ్చంట. లునులా మీద ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు చెప్పవచ్చంట. లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్లు గా ఉంటే..
Health Problems: ఇలా ఉంటే పౌష్టికాహార లోపం..
వారు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నారని.. వారి శరీరంలో విష, వ్యర్ధ పదార్థాలు ఉన్నాయని తెలుసుకోవచ్చట. లునులా రంగు నీలం లేదా పూర్తి స్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో షుగర్ వ్యాధి బాధితులు కాబోతున్నారని అర్ధం చేసుకోవాలి. లునులా పెద్దగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు సూచన. ఇలా పెద్దగా ఉంటే థైరాయిడ్ గ్రంథి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందని అర్థం.లునులా లేత నీరం రంగు మారితే మధుమేహం, గోధుమ రంగు మారితే ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్లు గుర్తించవచ్చు. ఎరుపు, తెలుపు రంగులో మారితే మూత్ర పిండాల సమస్యలు, నీలం రంగు మారితే ఇతర వ్యాధులు ఉన్నట్లు సూచన. ఇప్పుడే మీరు కూడా మీ గోళ్లను చూసుకుని ఎలా ఉన్నాయో చేక్ చేసుకోండి.