Health Problems : పచ్చి బొప్పాయి అస్సలే తినకూడదట.. చాలా డేంజర్!
Health Problems : బొప్పాయి పండు అయినా, ఆకులు అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మన అందరికీ తెలిసిందే. మన శరీరంలో ప్లేట్ లైట్లు తగ్గినా బొప్పాయి జ్యూస్ తో పాటు ఆకుల రసాన్ని తాగిస్తారు. అయితే బొప్పాయితో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ.. పచ్చి బొప్పాయి మాత్రం చాలా డేంజర్ అట. అది తింటే లేని లేని రోగాలు వస్తాయట. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలను బొప్పాయి తినకూడదని చెబుతుంటారు […]
Health Problems : బొప్పాయి పండు అయినా, ఆకులు అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మన అందరికీ తెలిసిందే. మన శరీరంలో ప్లేట్ లైట్లు తగ్గినా బొప్పాయి జ్యూస్ తో పాటు ఆకుల రసాన్ని తాగిస్తారు. అయితే బొప్పాయితో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ.. పచ్చి బొప్పాయి మాత్రం చాలా డేంజర్ అట. అది తింటే లేని లేని రోగాలు వస్తాయట. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలను బొప్పాయి తినకూడదని చెబుతుంటారు మన పెద్దల. కానీ వైద్యులు మాత్రం బొప్పడి పండు తింటే ఏం కాదు కాని,,, పచ్చిది మాత్రం తినొద్దని చెబుతారు. పచ్చి బొప్పాయిలో ఉండే ప్రొటీయోలైటిక్ ఎంజైన్ అయిన పపైన్ అనే పదార్థం ఉంటుందట.
అది గర్భాశయం సంకోచం చెందేందుకు కారణం అవుతుందట.అది గర్భస్రావం జరిగేందుకు కారణం అవుతుందట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బొప్పాయి తినుకూడదని చెబుతుంటారు. అయితే పచ్చి బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు మేలు కల్గుతుంది. కానీ ఎక్కువగా తింటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. పపైన్ మూలకం జీర్ణ సమస్యలను కల్గిస్తుందట. దాంతో విపరీతమైన కడుపు నొప్పికి దారి తీస్తుందట. అంతే కాకుండా పచ్చి బొప్పాయి తినడం వల్ల వాంతులు కూడా అవుతాయట. పండని బొప్పాయిలో బర్రపు పాటు ఉంటాయి అవి మానవ శరీరానికి నష్టం కల్గిస్తాయి.
అలాగే పచ్చి బొప్పాయి తినడం వల్ల గురక వంటి సమస్యలు కూడా వస్తాయట. దీని వల్ల ఆస్తమా రోగులకు అనేక సమస్యలు వస్తాయి. పచ్చి బొప్పాయిలో ఉండే తెల్లని పాల వల్ల ఎలర్జీ వస్తుందట. దీని వల్ల తలనొప్పి, దద్దుర్లు, తల తిరగడం వంటి సమస్యలను తెచ్చిపెడ్తుంది. అయితే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లు బొప్పాయి తినాలనుకుంటే మాత్రం వైద్యుల సలహాలు కచ్చితంగా తీసుకోవాల్సిందే. అంతే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా బొప్పాయి తినాలనుకుంటే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందే.