Third Wave : థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే.. ఖచ్చితంగా ఈ ఆకును తినాల్సిందే..!
Third Wave : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నుంచి ఎలాగోలా తప్పించుకున్నాం కానీ.. త్వరలోనే మరో ప్రళయం… థర్డ్ వేవ్ రూపంలో వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవడం కోసం తమ ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. కరోనాను అరికట్టేది శరీరంలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మాత్రమే. రోగ నిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. అంత సేఫ్ గా ఉండొచ్చు.
మరి.. రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి.. అంటే దానికి రెండే మార్గాలు.. ఒకటి పౌష్ఠికాహారం తీసుకోవడం.. ఇంకోటి.. ఆయుర్వేదం ప్రకారం రోగ నిరోధక శక్తిని పెంచే చిట్కాలను పాటించడం. పౌష్ఠికాహారం అనే సరికి.. ఏది తినాలి? ఏది తినకూడదు.. అనే సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. దాని బదులు.. ఆయుర్వేదంలోని చిట్కాలను పాటిస్తే బెటర్. దాని కోసం మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే బోలెడు చిట్కాలు ఉన్నాయి.
Third Wave : వాము ఆకులే థర్డ్ వేవ్ ను ఆపే శక్తి ఉన్న బెస్ట్ ఔషధం
వాము గురించి తెలుసు కదా. వామును రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాముకు ఆయర్వేదంలోనూ మంచి ప్రాధాన్యత ఉంది. వామును ఆయుర్వేదంలో అన్ని రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. వాము లాగానే.. వాము ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. వాము మొక్కలను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. వాటి ఆకులను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా థర్డ్ వేవ్ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అలాగే.. వాము ఆకులు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. కడుపు నొప్పి సమస్యలను తగ్గిస్తాయి. తేనెతో కలిపి వాము ఆకులను తీసుకుంటే.. జలుబుర, దగ్గు నయం అవుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. వాము ఆకులను అప్పుడప్పుడు నోట్లో వేసుకొని నమిలితే.. నోరు కూడా ఫ్రెష్ అవుతుంది. వాము ఆకులను కూర కూడా వండుకోవచ్చు. పప్పులోనూ ఈ ఆకులను వేసుకొని వండుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> మీరపకాయలు కారంగా ఉంటాయని తినడం మానేస్తే… మీరు ఈ ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయినట్టే
ఇది కూడా చదవండి ==> ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా చూశారా? ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?
ఇది కూడా చదవండి ==> పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా?