Health Tips : జనపనార విత్తనాలు మగాళ్లకు, ఆడవాళ్లకు వరం.. గుప్పెడు తింటే ఎన్ని ప్రయోజనాలో
Health tips : మనలో చాలామందికి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న పరిష్కార మార్గాలు తెలియదు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆయుర్వేదంలోని కొన్ని చిన్న చిన్న చిట్కాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మాత్రం గుర్తించలేరు. మనం నిత్యం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆనందంగా ఉండవచ్చు.సాధారణంగా ఆడవాళ్లు అయ్యే నెలసరి సమయంలో కలిగే ఒత్తిడి, నీరసం లాంటి వాటికి రకారకాల పరిష్కారాల గురించి వెతుకుతుంటారు. చాలామంది ఇబ్బంది ఎక్కువైతే డాక్టర్ల దగ్గరికి పరుగులు పెడుతుంటారు.
కానీ మనకు అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా దీనికి పరిష్కారం ఉంది. మనకు విరివిగా లభించే జనపనార విత్తనాలు (హంప్ సీడ్స్) ఈ ఇబ్బందుల నుండి మిమ్మల్ని బయటపడేస్తాయి.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉండే జనపనార విత్తనాలు తినడం వల్ల ఆడవాళ్లలో నెలసరికి ముందు వచ్చే కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసం లాంటివి తగ్గుతాయి. దీని వల్ల ఆడవారి నెలసరికి ముందు వచ్చే కడుపు నొప్పి, అలసట, నీరసం దరిచేరవు. జనపనార విత్తనాల్లో గామా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆడవారిలో నెలసరి సమయంలో సున్నితత్వాన్ని పెంచే హార్మోన్ ప్రొక్లాటిన్ ను తగ్గిస్తుంది.
Health Tips : జనపనార తినడం వల్ల..
అటు మగవాళ్లకు కూడా జనపనార విత్తనాలు మేలు చేస్తాయి. వీటిని రోజూ గుప్పెడు తినడం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే వీర్య కణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. సాధారణంగా ఈ జనపనార విత్తనాలు.. విత్తనాలు అమ్మే షాపుల్లో, ఆన్లైన్ స్టోర్స్ లో లభిస్తాయి. వీటిని నానబెట్టి పేస్ట్ చేసి కూరలలో వేసుకొని తినవచ్చు లేదంటే నేరుగా పొడిచేసి కూడా తినవచ్చు. లేదంటే జనపనార విత్తనాలను దోరగా వేయించి ఖర్జూరమ్, తేనె కలిపి లడ్డూలుగా చేసుకొని తినవచ్చు.