Health Tips : ఈ పండ్లు సంజీవని వంటివి.. వీటితో అనేక వ్యాధులకు చెక్..
Health Tips : మనలో చాలా మందికి మల్బరీ పండ్ల గురించి తెలుసు కానీ వాటిలో ఉండే పోషకాల గురించి అంతగా తెలియదు. ఈ పండ్లను జెల్లీల, సలాడ్స్ తయారీలో ఎక్కువగా వాడతారు. ఈ పండ్ల తో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ పండ్లు తినడం వల్ల రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్త ప్రసరణ సైతం బాగా సాగుతుంది. దీనితో పాటుగా గుండె పనితీరు సైతం బాగుంటుంది. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రరక్తకణాలు పెరిగేందుకు ఇవి దోహదపడతాయి. దీనితో పాటు శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలోనూ ఇవి సహాయపడుతాయి
. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ ప్రక్రియ వేగంగా జరగడంలో ఇది ఉపయోగపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలను సైతం నివారిస్తుంది. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉండటం వల్ల బాడీకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లభిస్తుంది.ఈ పండ్లను డయాబెటిస్ పేషెంట్స్ సైతం తినొచ్చు. ఇందులో ప్లాస్మా ఉంటుంది. ఇది రక్తంలోని గ్గూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని సైతం పెంచుతుంది. నరాలను బలంగా మార్చుతుంది. ఇందులో విటమిన్ ఏ సైతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు.
Health Tips : డయాబెటిస్ వారు తినొచ్చు
వయస్సు మీద పడేసమయంలో వచ్చే సమస్యలను సైతం ఈ పండ్లు తగ్గిస్తాయి. చర్మం మీద ముడతలను సైతం తగ్గిస్తాయి. యవ్వనంగా కనిపించేలా సహాయపడతాయి. చాలా మందిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. ఈ పండ్లతో ఆ సమస్యకు సైతం చెక్ పెట్టొచ్చు. ఈ పండ్లలో అనేక రకాల పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి, శరీరానికి మేలు చేస్తాయి. కానీ వీటిలోని పోషకాల గురించి తెలియక చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. ఇన్ని విషయాలు వీటి గురించి తెలిశాక వీటిని వదులుకునేందుకు ఇష్టపడరు.