Health Tips : మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది మీ అలవాట్లే.. ఈ విధంగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..!!
Health Tips : మనం పాటించే కొన్ని అలవాట్లు వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక రుగ్మతలు వేధిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఆరోగ్యకర అలవాటులతో మీ శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మనం జీవనశైలి విధానంలో చాలా మార్పులు వచ్చాయి. పాతకాలపు రోజులు పరిస్థితులు లా లేవు ప్రతిరోజు ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్నాం శారీరిక శ్రమ లేని ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. విపరీతమైన పని ఒత్తిడి వలన ఎన్నో రోగాలు మనల్ని వేధిస్తున్నాయి. మానసిక రుక్మతులు కూడా మనల్ని వేధిస్తున్నాయి. అయితే కొన్ని ఆరోగ్యకర అలవాట్లతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వ్యాయామం: రోజు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు.
ఇది చెమట ద్వారా శరీరం నుంచి అన్ని టాక్సిన్స్లను తొలగించడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇది మీ రక్తప్రసరణను కూడా పెంచుతుంది. మీ జుట్టుకు చర్మం కు కూడా వ్యాయామం చాలా అవసరం. మంచి నిద్ర: ఒత్తిడి లెవల్స్ ను తగ్గించడానికి మెదడు పనితీరును మెరుగుపరచడానికి మంచి నిద్ర చాలా అవసరం. కావున ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండడానికి రాత్రి ఆలస్యంగా పడుకునే అలవాటును మానుకోవాలి. త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. చురుకుగా ఉండండి: లిఫ్ట్ బదులుగా మెట్లు ఇక్కడ మీ శరీరానికి ఫిట్గా చురుగ్గా తయారవుతుంది. మీరు వారాంతంలో మీ స్నేహితులతో మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీ తాగాలి; ఆరోగ్యకరమైన శరీరం కోసం గ్రీన్ టీ ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రయత్నాలు ఎంచుకోవాలి.
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. బయట ఫుడ్ వద్దు.. ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్ కు వీలైనంతవరకు దూరంగా ఉండాలి.. రుచికరమైన అల్పాహారం; చాలామంది బరువు తగ్గడానికి అల్పాహారం వద్దు అంటారు. అయితే అల్పాహారం మానేయడం వలన మీకు ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా తినే ఆకాశం ఉంటుంది. కావున రుచికరమైన అల్పాహారం తగు మోతాదులో తీసుకుంటే చాలా మంచిది.. టైం టేబుల్: మీరు చేయవలసిన పనులు జాగ్రత్తలను సిద్ధం చేసుకోవాలి.
రోజువారి లక్ష్యాలను సెట్ చేసుకోవాలి. ఇది ఒత్తిడిని కలిగించే చివరి క్షణం వరకు కాకుండా ముందే పనులు చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. హైడ్రేట్ గా ఉండాలి; శరీరాన్ని గా హైడ్రేటుగా ఉంచడానికి తగినంత నీరు చాలా అవసరం. మీ కణాల సరియైన పని తీరుకు శరీర ఉష్ణోగ్రతను గురించి టాక్సిన్ బయటికి పంపడానికి ఇన్ఫెక్షన్ నివారించడానికి హైడ్రేషన్ చాలా అవసరం. తొందరగా నిద్ర లేవాలి; ఉదయాన్నే నిద్ర మేల్కొనడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా శరీరం సృష్టిగా అనిపిస్తుంది అలాగే ధ్యానం వ్యాయామం లాంటివి చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది.