Health Tips : ఈ వేసవిలో ఏ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే చాలు..!!
Health Tips : ఈ వేసవికాలంలో చాలామంది ఎక్కువగా డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. అలా అవ్వకుండా ఈ వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పది రకాల ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు.. అయితే ఆరోగ్యకరమైన జీవనశీలిని అవలంబించడం మంచి ఆహారం పట్ల శ్రద్ధ చూపడం వలన ఏసవిలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. వేసవి సమీపిస్తున్న కొద్ది కొన్ని కూరగాయలు పండ్లు వినియోగం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే అవి మనల్ని హైడ్రేటుగా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడడమే కాకుండా కావలసిన పోషకాలు మనకి అందిస్తాయి. అయితే వేసవిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఈ పది సూపర్ ఫుడ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. వేసవిలో తీసుకోవాల్సిన పది ఆరోగ్యకరమైన ఆహారాలు;
*సోంపు గింజలు: ఈ సోంపు గింజల శరీరానికి చల్లదనాన్ని అందించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి మంటను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. సోంపు గింజలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది. *టమోటాలు: వీటిలో లైకు ఫిన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్య కిరణాలు నుంచి శర్మాన్ని రక్షించడంలో ఉపయోగపడతాయి. *నిమ్మకాయ; నిమ్మరసంలో సిక్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని పీహెచ్ లెవెల్స్ ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. *పచ్చని ఆకుకూరలు: ఆకుపచ్చని ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. *పుదీనా; పుదీనా శరీరాన్ని చల్లదనాన్ని కలిగిస్తుంది.
దీని తీసుకోవడం వలన మీకు ఎప్పుడు ఫ్రెష్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. *కొబ్బరినీరు: కొబ్బరినీరు సహజ ఎలక్ట్రోలైట్ పానీయం ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. *పెరుగు; పెరుగులో పో బ్రయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. *దోసకాయ: దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు కలిగి ఉంటుంది. *పుచ్చకాయ: పుచ్చకాయలు నీరు అధికంగా ఉంటుంది. ఎండాకాలంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి కొరత సమస్య ఉండదు. *పైనాపిల్: దీనిలో బ్రో మైలెన్ అనే ఎంజైమ్ పైనాపిల్ లో ఉంటుంది. ఇది యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పండు శరీరంలోని మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.