Health Tips : ఇమ్యూనిటీ పెంచుకోవాలని అనుకుంటున్నారా? సింపుల్‌గా ఇలా చేయండి..
Health Tips : ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. దాని బారిన పడకుండా ఉండేందుకు ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు వ్యాక్సిన్ పై ఫోకస్ పెట్టాయి. కానీ ప్రజలు సైతం తమ బాడీలో వ్యాధి నిరోదక శక్తికి పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ఇంపార్టెంట్. అందుకోసం మనం తీసుకునే ఆహారంలో పోషకాలను భాగం చేసుకోవాలి. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైంది ఉసిరి. ఇందులో ఎన్నో పోషక గుణాలున్నాయి. దీనిలో ఉండే విటమిన్ సీ బాడీకి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే బాడీలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుుంది.
ఇందుకోసం ఉల్లి పౌడర్ ను చాలా మంది నిల్వ ఉంచుకుంటారు. మార్కెట్‌లో ఈ పౌడర్ అందుబాటులో ఉన్నా.. ప్రస్తుతం కల్తీ యుగం కారణంగా దేనిని తొందరగా నమ్మడానికి వీలులేదు. కాబట్టి పౌడర్ ను ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవడం బెటర్.ముందుకు అరకిలో ఉసిరిని శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక గిన్నెలో రెండు లీటర్ల నీటిని వేసి నీటిని మరిగించాలి. అందులో కడిగిన ఉసిరికాయలను వేసి బాగా ఉడకనివ్వాలి. అవి బాగా ఉడికిన తర్వాత చల్లార్చాలి.
Health Tips : ఎలా తయారు చేసుకోవాలంటే..
నీటిలోంచి ఉసిరికాయలను వేరు చేసి అందులో ఉన్న గింజలను తీసివేయాలి. తర్వాత వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అనంతరం వాటిని ఒకటి నుంచి రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సిలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా చేస్తే ఉసిరిపొడి రెడీ అయినట్టే. గాజు పాత్రలో లేదా గాలి పోకుండా ఉండే డబ్బాలో దీనిని నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు ఇది ఫ్రెష్ గా ఉంటుంది. ఇందులో ఒక్క చుక్క నీరు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనప్పుడు డబ్బాలోంచి ఉసిరి పౌడర్ ను తీసుకుని వినియోగించుకోవచ్చు.