Health Tips : దంతాలలో రక్తం కనిపిస్తుందా..? డేంజర్ లో పడినట్లే… ఇలా ట్రై చేస్తే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : దంతాలలో రక్తం కనిపిస్తుందా..? డేంజర్ లో పడినట్లే… ఇలా ట్రై చేస్తే…!

Health Tips : మనం చాలామందిలో దంతాల సమస్యను చూస్తూనే ఉంటాం.. కాకపోతే చాలామంది దంత సమస్యలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ముఖ్యంగా దంతాల నుండి రక్తం రావడం అనే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దంతాలను శుభ్రం చేసేటప్పుడు లేదా క్లీన్ చేసుకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దానిని సహజంగా తీసుకోవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు… నిజానికి చిగుళ్లలో నుంచి రక్తం రావడం అనేది అంతర్గత సమస్య అని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 November 2022,6:30 am

Health Tips : మనం చాలామందిలో దంతాల సమస్యను చూస్తూనే ఉంటాం.. కాకపోతే చాలామంది దంత సమస్యలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ముఖ్యంగా దంతాల నుండి రక్తం రావడం అనే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దంతాలను శుభ్రం చేసేటప్పుడు లేదా క్లీన్ చేసుకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దానిని సహజంగా తీసుకోవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు… నిజానికి చిగుళ్లలో నుంచి రక్తం రావడం అనేది అంతర్గత సమస్య అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దంతాల నుండి రక్తం రావడం అనే సమస్య ఎన్నో కారణాలవల్ల వస్తూ ఉంటుంది. గర్భధారణ, గాయాలు, బ్రషింగ్, వాపు లాంటి కారణాలు కూడా అయి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు మీ దంతాల నుండి రక్తం వచ్చినట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు..

దానిద్వారా మీ దంతాల చిగుళ్ల నుంచి రక్తం రాదని తెలియజేస్తున్నారు.. ఇంకా దంతాలు ఆరోగ్యం, మెరుపు ఉంటాయని.. కాబట్టి చిగుర్ల నుంచి రక్తం వచ్చే సమస్యను ఏ విధంగా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం… విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపితం చేసుకోవచ్చు. అదేవిధంగా దంతాల చిగుళ్ల నుండి రక్తం రాకుండా చూసుకోవచ్చు. దీనికోసం ఆహారంలో క్యారెట్, చెర్రీస్, నారింజ తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు… హైడ్రోజన్ పెరాక్సైడ్ తో క్లీన్ చేయండి… నోటి ని శుభ్రం చేసుకోవడానికి బ్యాక్టీరియాను నశింప చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో క్లీన్ చేసుకోవచ్చు.

Health Tips on bleeding gums causes and treatment home remedies to cure teeth

Health Tips on bleeding gums causes and treatment home remedies to cure teeth

ఇలా చేసుకోవడం వలన చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఆగిపోతుంది. అయితే దీనిని మింగకూడదు… ధూమపానం చేయవద్దు… ఊపిరితిత్తుల, క్యాన్సర్ గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని అధికమించడంతోపాటు ధూమపానం చిగుళ్లలో రక్తం రావడం కూడా కలిగిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవేషన్స్ ప్రకారంగా… త్రివరమైన చిగుళ్ల సమస్యకు ధూమపానం ముఖ్య కారణమని వెలువడింది. దంతాల శుభ్రత పట్ల జాగ్రత్తలు వహించండి… దంతాల నుండి రక్తం రాకుండా ఉండడానికి కనీసం రోజుకి రెండుసార్లు బ్రష్ చేయాలి. ఒకసారి పుక్కిలించండి. గర్భధారణ టైంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. నిజానికి గర్భధారణ టైంలో హార్మోన్ వెచ్చు, తగ్గులు చిగుళ్ల వ్యాధికి చిగుళ్లలో రక్త రావడానికి కూడా దోహత పడవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది