Health Tips : మోకాళ్ళ నొప్పులను శాశ్వతంగా తగ్గించే… సులువైన మార్గం ఇదే…
Health Tips : ప్రస్తుతం అన్ని వయసుల వారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. పూర్వం పెద్దవారికి మాత్రమే మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులో ఉన్నవారికి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా తగ్గాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఎందుకంటే మనం వంటల్లో వేసుకునే ఉప్పు వలన మోకాళ్ళ నొప్పులు రావడానికి ముఖ్య కారణం. మనం తినే ఆహారంలో రుచి కోసం వేసుకున్న ఉప్పు అంత లోపలికి వెళ్లి యూరిన్ ద్వారా నాలుగు, మూడు గ్రాములు బయటకు వస్తుంది. మనం తినేది 10 గ్రాముల నుండి 20 గ్రాముల దాకా ఉప్పు తింటాం.
మిగిలిపోయిన ఉప్పు అంత శరీరంలో పేరుకుపోయి సోడియం బై కార్బోనేట్ క్రిస్టల్స్ లా మారి మోకాళ్ళలో చేరుకుంటుంది. ఇలా ఎక్కువగా పేర్కొన్న ఉప్పు వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులకు మొదటి శత్రువు ఈ ఉప్పు. తినే ఆహారంలో ఉప్పును తగ్గిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒక మూడు నాలుగు నెలలు ఉప్పు వాడకుండా ఆహారాన్ని తింటే మంచి ఫలితం దక్కుతుంది. సాధారణంగా ఉప్పులేని ఆహారం తినడం చాలా కష్టం. కానీ మధ్యాహ్న భోజనంగా ఆకుకూరలను తీసుకొని ఏదో ఒక కూరగాయలను రకరకాల ఫ్రైస్ చేసుకోవచ్చు. వీటిలో మల్టీ గ్రైన్ ఆటతో చేసిన పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి.
సాయంత్రం పూట కొబ్బరి నీళ్ళు గాని, పళ్ళ రసాలు గాని, చెరుకు రసం గాని తీసుకోవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లకి రాత్రిపూట కేవలం పండ్లు మాత్రమే నాలుగైదు రకాలు తీసుకోవాలి. ఇలా తినడం వలన కూడా బరువు తగ్గుతారు. ఉదయం పూట అల్పాహారంగా రెండు మూడు రకాల మొలకలను ఆహారంగా తీసుకోవాలి. ఈ మొలకలను ఖర్జూరం, కిస్మిస్, దానిమ్మ, గింజలు, ఆపిల్ ముక్కలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఉదయం సాయంత్రం ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఉప్పు శరీరంలోకి వెళ్ళదు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆహారపు అలవాట్లు పాటించడం వలన మోకాళ్ళ నొప్పులు అనేవి త్వరగా తగ్గిపోతాయి.