Heels Cracked : కాళ్ళ మాడమలు పగలడంతో ఇబ్బంది పడుతున్నారా… వీటిని రాసుకోండి…??
ప్రధానాంశాలు:
Heels Cracked : కాళ్ళ మాడమలు పగలడంతో ఇబ్బంది పడుతున్నారా... వీటిని రాసుకోండి...??
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా మారడం,తేమను కోల్పోవడం,కాళ్ళ మడమలు పగిలిపోవడం ఇలా ఒకటి ఏంటి ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడతాయి. అలాగే సీజనల్ గా వచ్చే వ్యాధులు జలుబు మరియు జ్వరం, దగ్గు లాంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి. ఇవి మాత్రమే కాక మడమలు అనేవి కూడా బాగా పగిలిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే మడమలు అనేవి తీవ్రంగా పగిలిపోయి చాలా నొప్పిగా కూడా అనిపిస్తుంది. అందులో బయటపని చేసే వారికి నొప్పి అనేది మరింత ఎక్కువగా ఉంటుంది…
చలికాలంలో కాళ్ల మడమలు పగిలినప్పుడు క్లీనింగ్ అనేది చాలా అవసరం. అంతేకాక ధూళి మరియు దుమ్ము కారణం చేత కూడా మడమలు అనేవి బాగా పగిలిపోతాయి. కావున ఈ చలికాలంలో కాళ్ళ ని ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన పగుళ్లు అనేవి అసలు రావు. ఒకవేళ వచ్చిన తొందరగా తగ్గిపోతాయి. ఈ కాలంలో చల్లటి నీటిని వాడితే కాళ్ళు అనేవి మరింత డ్రై గా మారతాయి. కావున చలికాలంలో గోరువెచ్చని నీటిని వాడాలి…
గోరువెచ్చని నీటితో కాళ్ళ ను కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మాయిశ్చరైజర్ అనేది లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా ఆయిల్ ను రాసిన పర్వాలేదు. అలాగే రాత్రి టైమ్ లో పడుకునే ముందు మడమలకు ఏదైనా నూనెను రాసుకోండి. ఇలా చేయటం వలన మడమలు అనేవి మెత్తగా మారతాయి. అంతేకాక వాజెలిన్ మరియు తేనెను రాసుకున్న పర్వాలేదు…