Ajwain : ఆరోగ్యానికి మేలు చేసే వాము… రోజు తింటే ఎన్ని లాభాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ajwain : ఆరోగ్యానికి మేలు చేసే వాము… రోజు తింటే ఎన్ని లాభాలో…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ajwain : ఆరోగ్యానికి మేలు చేసే వాము... రోజు తింటే ఎన్ని లాభాలో...!

Ajwain : ప్రస్తుతం మన ఉన్న ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉరుకుల పరుగుల జీవితంతో అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. పని ధ్యాసలో పడి ఆరోగ్యం కాపాడుకునే విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే ఏది పడితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఈ తరుణంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీంతో శరీరంలో ఉన్న శక్తి అనేది తగ్గిపోతుంది. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి అనే దానిని అసలు మరిచిపోయారు ప్రజలు. ఏదైనా చిన్నపాటి ఆరోగ్యం వచ్చింది అంటే చాలు వెంటనే వైద్యుని సంప్రదిస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే. కడుపునొప్పి,తలనొప్పి, జలుబు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా చాలా మంది డాక్టర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని వెంటనే రక్షించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే. మహిళలు నెలసరి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి…

రుతుక్రమంలో మహిళలకు తరచుగా కడుపునొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ తరుణంలో వాము మంచి ఆయుర్వేదంగా కూడా పనిచేయగలదు. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దానిలో ఒక స్పూన్ వాము వేసి బాగా మరగబెట్టుకొని ఆ నీటిని గనక తీసుకున్నట్లయితే కడుపునొప్పి అనేది తగ్గుతుంది. అంతేకాక ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వేసవిలో వామును తీసుకోవటం వలన శరీరానికి కావలసినటువంటి పోషకాలు అందటంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. ఒంట్లోని చెడు కొవ్వులను బయటకు పంపించడంలో కూడా ఈ వాము అనేది ఎంతో సహాయం చేయగలదు. అలాగే మలబద్ధక సమస్యలను కూడా ఇట్టే మాయం చేయగలదు. పైగా అధికంగా తినటం వలన కడుపు ఉబ్బసం వచ్చే అవకాశం ఉన్నది.

Ajwain ఆరోగ్యానికి మేలు చేసే వాము రోజు తింటే ఎన్ని లాభాలో

Ajwain : ఆరోగ్యానికి మేలు చేసే వాము… రోజు తింటే ఎన్ని లాభాలో…!

ఈ టైమ్ లో కూడా వామును డైరెక్టుగా చిటికెడు నోట్లో వేసుకొని నమిలి ఆ రసం మింగటం వలన కూడా అజీర్తి అనేది తొందరగా తగ్గుతుంది. ఇలా కష్టం అనిపిస్తే వెంటనే గోరువెచ్చని నీటిలో వాముపొడి కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా ఎక్కడికో పరుగులు పెట్టకుండా వంటింటినే వైద్యశాలగా ఉపయోగించుకొని సహజంగా మన ఆరోగ్యానికి కూడా రక్షించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలిపారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది