Lemon Juice : యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తుందా…. అద్భుతమైన ఔషధం మీకోసం…!
ప్రధానాంశాలు:
Lemon Juice : యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తుందా.... అద్భుతమైన ఔషధం మీకోసం...!
Lemon Juice : యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో పేరుకుపోయే ఒక రకమైన విష పదార్థమని చెప్పవచ్చు. అయితే ఈ యూరిక్ యాసిడ్ అనేది యూరిన్ మరియు ప్రోటీన్ విచ్ఛిన్నం ద్వారా ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్ ఆసిడ్ యొక్క పరిమాణం పెరిగినట్లయితే తీవ్ర సమస్యలు ఎదుర్కొక తప్పదు. అయితే వాస్తవానికి యూరిక్ యాసిడ్ అనేది తప్పుడు ఆహారపు అలవాట్లను , జీవన శైలిని మార్చుకోవడం వలన పెరుగుతాయి. తద్వారా కీళ్ల నొప్పులు , కాళ్ళ వాపులు ఆయాసం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ సమస్యను నివారించాలి అంటే కచ్చితంగా యూరిక్ యాసిడ్ ను నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే దీనికోసం ఓ చక్కటి పరిష్కారం ఉంది. రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ ను నియంత్రించవచ్చు. ఇక ఆ పదార్థాలు ఏమిటంటే నిమ్మరసం మరియు వాము…
Lemon Juice : నిమ్మరసం మరియు వాము…
అయితే వాము మరియు నిమ్మరసం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ రెండు పదార్థాలలో పోషక విలువలు ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తాయి. ఇక వాములో ఉండే రసాయనాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ప్రతిరోజు వాము తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడవచ్చట. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి వాము అనేది దివ్య ఔషధమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక వాములో ఉండే గుణాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే జలుబు అలసట తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా వాము మనల్ని కాపాడుతుందని ఆయుర్వేదంలో తేలింది. కావున యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారికి వాము మరియు నిమ్మకాయతో కలిపి చేసిన ఔషధం ఎంతగానో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Lemon Juice : ఎలా తయారు చేసుకోవాలంటే…
దీనికోసం మీరు ముందుగా నీటిని గోరువెచ్చగా చేసుకోవాలి. అనంతరం ఆ నీటిలో ఒక చెంచా నిమ్మరసం మరియు ఒక చెంచా వాముపొడి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం తాగటం వలన మెరుగైన ఫలితాలను పొందుతారు. అంతేకాక నిమ్మరసం కలిపిన వామ్ తాగటం వలన శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు బరువు తగ్గడానికి జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుండి బయట పడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.