Coffee : ఇమ్యూనిటీ పెంచే కాఫీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee : ఇమ్యూనిటీ పెంచే కాఫీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :28 September 2023,7:00 am

Coffee : ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ కూడా ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఈ పానీయాలను ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం వీటికి బదులు మన ఆరోగ్యానికి మేలు చేసే దాల్చిన చెక్కతో తయారు చేసే కాఫీని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం దాల్చిన చెక్కతో చేసిన కాఫీ తాగాలి. అందులోనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మధుమేహాన్ని కంట్రోల్ లో ఉచ్చుతుంది. వాపు గాయాలను కూడా నయం చేస్తుంది. నాలుగు యాలక్కాయలు వేసి చేసిన కాఫీ రుచి సువాసనతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులోని ఫైబర్ మినరల్స్ శరీరంలో రక్త సరఫరా వేగవంతం చేస్తాయి.

గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు తగ్గడానికి ఇది పనిచేస్తుంది. యాలక్కాయలేకుండా కాఫీలో లవంగాన్ని కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. విటమిన్ బి12, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మినరల్స్ లాంటివి జాజికాయలో కూడా చాలా ఉన్నాయి. దీన్ని కాఫీతో పాటు కలిపి తాగితే జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణ క్రియ బాగా జరుగుతుంది. ఇటువంటి కాఫీ తాగితే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ముక్కు దిబ్బడను దూరం చేస్తుంది. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దాల్చిన చెక్కతో తయారుచేసిన కాఫీని తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకమైన రుచి వాసన కలిగి ఉండే దాల్చిక చెక్కను వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు.

How many benefits of drinking cinnamon coffee

How many benefits of drinking cinnamon coffee

అలాగే విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ ఇలా ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఆరోగ్యపరంగానూ దాల్చిన చెక్క అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఎంత మేలు చేసినప్పటికీ దాల్చిన చెక్కలు కొందరు తీసుకోరాదు. ఆ కొందరు ఎవరు. వారు ఎందుకు తీసుకురాదు. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించే శక్తి దాల్చిన చెక్కకుంది. అందుకే మధుమేహం ఉన్నవారు దాల్చిన చెక్కను డైట్ లో చేర్చుకుంటే మంచిది అని అంటుంటారు.

ఉండాల్సిన దానికంటే తక్కువ షుగర్ లెవెల్స్ ఉంటాయి. అలాంటివారు దాల్చిన చెక్కను అవాయిడ్ చేయాలి. లేకుంటే షుగర్ లెవెల్స్ మరింత దిగజారి అనేక సమస్యలను పేస్ చేయాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కూడా దాల్చిన చెక్కను తీసుకోకపోవడమే మంచిది అని అంటున్నారు నిపుణులు .

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది