Sleep : మీరు రోజులు ఎన్ని గంటలు పడుకుంటారు.? కంపల్సరీ తెలుసుకోవాల్సిన బిగ్ మ్యాటర్…!
Sleep : సహజంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అందరూ టీవీలకు, ఫోన్లకు, లాప్టాప్ లకు అతుక్కుపోయి సరియైన నిద్ర నిద్రించడం లేదు.. సరియైన ఆహారం కూడా తీసుకోవడం లేదు.. ప్రధానంగా నిద్ర విషయంలో అయితే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం నిద్ర విషయంలో సమయం అంటూ లేకుండా గడిపేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర పోవడం తొమ్మిది పది గంటలు నిద్రలేచి హడావిడిగా ఎవరి పనులు వారు వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్నారు.ఇది ఎన్నో రకాల ఇబ్బందులకు కారణమవుతుంది అని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రధానంగా నిద్ర విషయంలో అశ్రద్ధ పనికిరాదని సరియైన నిద్ర నిద్రంచాలని చెప్తున్నారు..ఒకానొక సమయంలో నిద్రకు వేలంటూ ఉండేది.
రాత్రి గంటలు 9 గంటలకు పడుకుంటే తెల్లవారుజామున నాలుగు ఐదు గంటలకి నిద్రలేచేవారు.. ఆ తర్వాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లేవారు.. మనిషి జీవన శైలిలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం లాంటి పరిస్థితి ఏర్పడింది.అయితే ఏ సమయానికి నిద్రపోవాలి.. ఏ సమయానికి నిద్రలేవాలి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం…
ఈ టైంలో నిద్ర చాలా మంచిది
నిత్యం కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రించాలి. వయసును బట్టి నిద్ర పోయే వేళలు ఉంటాయి. యువకులు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య నిద్రపోవాలి. ఇక పెద్దలైతే రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు నిద్రించాలి. స్కూల్ కి వెళ్ళని చిన్నారులకు 10 గంటల వరకు. స్కూల్ కి వెళ్లే చిన్నారులైతే తొమ్మిది నుంచి పది గంటలు నిద్ర చాలా ముఖ్యం. యువకులు ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర పోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.
సుమారు 8 గంటల నిద్ర ముఖ్యం
సహజంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన ప్రజలు అర్ధరాత్రి వరకు మెలుక్కువ గా ఉంటున్నారు. దాంతో చాలా మంది సరియైన నిద్ర పోవడం మానేస్తున్నారు.నిద్రించడానికి సరైన సమయం ఏదో తెలుసుకోవడం కూడా చాలా అవసరం..
నిద్రలేమితో ఎన్నో సమస్యలు
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు వలన నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. గ్రామాలలో ఒకప్పుడు రాత్రి 8 గంటలు దాటితే మేలుకొని ఎవరు ఉండేవారు కాదు.. అయితే ఇప్పుడు గ్రామాలలో కూడా 10 నుంచి 11 గంటల వరకు మెలకువగా ఉంటున్నారు. నిద్రపోకపోవడం వలన ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కోపం, చిరాకు, మలబద్దకం, నీరసం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. కావున సరియైన పద్ధతిలో నిద్రపోవాలని నిపుణులు చెప్తున్నారు.