Health Problems : వేసవిలో నీరు ఎంత తాగాలి, ఎలా తాగాలి.. ఎక్కువ తాగితే కలిగే నష్టాలేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Problems : వేసవిలో నీరు ఎంత తాగాలి, ఎలా తాగాలి.. ఎక్కువ తాగితే కలిగే నష్టాలేంటి?

 Authored By pavan | The Telugu News | Updated on :11 May 2022,3:00 pm

Health Problems : వేసవి కాలం కావడంతో ఎండలు మండి పోతున్నాయి. వాటి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు అధిక మొత్తంలో నీళ్లు తాగుతున్నారు. అందుకు కారణం ఎండ తీవ్రత వల్ల మన శరీరంలో దాహార్తి ఎక్కువగా పెరిగిపోవడమే. అందుకే వేసవి కాలంలో ఆకటి కంటే కూడా అందరికీ దాహమే ఎక్కువ వేస్తుంటుంది. అందుకే ఎక్కువ మొత్తంలో నీళ్లను తాగుతున్నారు. ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కోవడానికి ముఖ్య కారణం మనం కడుపునిండా ఆహారం తీసుకోవడమే. ఇలా తీసుకోవడం వల్ల నీరు పెట్టడానికి కడుపులో ఎటువంటి కాలీ ఉండదు. అందువల్ నీళ్లు త్రాగడం కుదరదు. మరియు దాహార్తిని తీర్చుకోలేము. మీరు భోజనం చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత కూడా దాహం వేస్తుంది. అంటే మీ లోపల దాహం యొక్క లక్షణాలు తీరలేదు కాబట్టే దాహం వేస్తుంది.

మన మెదడులో ఆకలి సెంటర్ వేరు. అందువల్ల దాహం తీరుకపోతే దాహం సెంటర్ నుంచి సిగ్నల్స్ వస్తాయి. మన దాహం తీరకుండానే ఆకలిని తీర్చుకుంటున్నాం. ఇలా ఎన్ని నీళ్లు తాగిన ఆ నీరంతా పొట్టలోని ఆహారంలో కలిసి పోయి పొట్టలోనే ఉంటాయి. అందువల్ల మనకు దాహం అనేది తీరదు.అంతే కాకుండా వేసవి కాలం వచ్చిందంటే కొత్త ఆవకాయలు పెట్టుకుంటారు. దీనిలోని అధిక కారం, ఉప్పు, మరియు నూనెల వల్ల దాహం ఎక్కువగా వేస్తుంది. పిల్లలందరూ ఇంటి వద్దనే ఉండడం వల్ల ఆయిల్ ఫుడ్స్ మరియు మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దాహం ఎక్కువ అవుతుంది. అంతే కాకుండా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎక్కువగా వెళ్లడం వల్ల అక్కడ అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాం.

Health Problems how to drink water in summer

Health Problems how to drink water in summer

కనుక దాహార్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ దాహార్తిని తీర్చుకోవడానికి మనం ఉదయం లేవగానే అల్పాహారం తీసుకోకపోతే ముందు ఒఖ లీటర్ నీళ్లు తీసుకోవాలి. ఇలా తీసుకున్న కాసేపటకి అల్పాహారం తీసుకోవచ్చు. ఇలా ముందుగా తీసుకున్న నీటి వలన మనకు ఐదారు గంటల పాటు దాహార్తి ఉండదు. శరీరం మొత్తం చల్లబడుతుంది. దీని ద్వారా దాహం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం చేయకముందు రెండు గంటల ముందు నుంచి కొంచెం కొంచెంగా నీటిని తీసుకోవడం ద్వారా దాహం యొక్క సెంటర్ ను ఫుల్ చేయవచ్చు. దీని వల్ల కూడా మనకు రెండు గంటల వరకు దాహం అనిపించదు. అదే విధంగా రాత్రి భోజనం చేసే ముందు కూడా కొంచెం కొంచెంగా నీటిని తీసుకోవడం ద్వారా దాహార్తిని తీర్చుకోవచ్చు. ఈ నియమాలు పాటించడం ద్వారా సమ్మర్ లో మనం హాయిగా జీవించవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది