Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టీని మీరు రోజూ తాగాల్సిందే?
Weight Loss : చాలామంది బరువు తగ్గాలనుకుంటారు. కానీ.. బరువు తగ్గడం కోసం ఎలాంటి కసరత్తులు చేయరు. అలాగే.. ఎన్ని కసరత్తులు చేసినా కొందరు తగ్గరు. కొందరు మాత్రం ఏది పడితే అది తినేస్తుంటారు. దీంతో బరువు పెరుగుతూ పోతుంటారు కానీ.. తగ్గరు. దీంతో బరువు ఎలా తగ్గాలంటూ ఆందోళన చెందుతుంటారు. అయితే.. బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడతారో.. ఆ కష్టంతో పాటు.. ఎంతో ఇష్టంగా తినే కొన్ని ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. అప్పుడే బరువు తగ్గుతారు. ఎందుకంటే.. ఎంత కష్టపడి వ్యాయామం చేసినా.. తిండి విషయంలో కంట్రోల్ లేకపోతే కష్టం. బరువు తగ్గడం పక్కన పెడితే.. ఇంకా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

tulsi tea health benefits for weight loss telugu
అందుకే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. బరువు తగ్గేందుకు మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి. దానితో పాటు.. తులసి టీని రోజూ తాగండి అని చెబుతున్నారు. అసలు.. తులసి టీని తాగితే.. బరువు ఎలా తగ్గుతారు? తులసి టీకి, బరువుకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా. పదండి.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
Weight Loss : బరువు తగ్గాలనుకునేవాళ్లు.. తులసి టీని ఖచ్చితంగా తాగాల్సిందే
తులసి ఆకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలోనూ తులసిని ఉపయోగిస్తారు. తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానితో పాటు.. శరీరంలో ఏర్పడే ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి అది కాపాడుతుంది. తులసి ఆకులను డైరెక్ట్ గా కూడా తినవచ్చు. అలాగే.. తులసి ఆకులతో టీని కూడా చేసుకొని తాగొచ్చు.

tulsi tea health benefits for weight loss telugu
తులసి ఆకుల్లో జీవక్రియను పెంచే పదార్థాలు ఉంటాయి. శరీరంలో ఉన్న కేలరీలను వేగంగా కరిగించి.. జీవక్రియను వేగవంతం చేస్తాయి. తులసి టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఆందోళనను తగ్గిస్తాయి. శరీరంలో ఉండే వేడిని కూడా అవి తగ్గిస్తాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలన్నా.. తులసి టీని తాగాల్సిందే.

tulsi tea health benefits for weight loss telugu
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడంతో పాటు.. శరీరంలో వృధాగా ఉండే కేలరీలను తులసి టీ వేగంగా కరిగిస్తుంది. దాని వల్ల.. బరువు తగ్గుతారు. శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను తులసి టీ తగ్గిస్తుంది. బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. అందుకే.. తులసి టీని ఖచ్చితంగా నిత్యం తాగితే.. ఓవైపు బరువు తగ్గడంతో పాటు.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఉదయం అల్పాహారంగా దీన్ని తింటే.. ప్రాణాలకే ప్రమాదం..!
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండితో చేసిన రోటీలను ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమౌతుంది? షుగర్ ఉన్నవాళ్లు అసలు ఎగ్స్ తినొచ్చా? తినకూడదా?