Jogging : జాగింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయమా? సాయంత్రమా? ఎప్పుడు చేస్తే మంచిది?
Jogging : జాగింగ్.. అనేది మనిషికి చాలా ముఖ్యం. జాగింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. రోజూ జాగింగ్ అలవాటు ఉండాలి. అలా అయితేనే శరీరం ఫిట్ గా ఉంటుంది. మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. వ్యాయామం చేయకపోతే ఎన్నో రోగాలు అటాక్ చేస్తాయి. జాగింగ్ వల్ల.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. బాడీ కూడా ఫిట్ అవుతుంది. కేవలం జాగింగ్ చేయడం వల్ల.. శరీరం మొత్తానికి వ్యాయామం లభిస్తుంది. అందుకే.. జిమ్ కు వెళ్లకపోయినా.. ఇంకేం చేయకపోయినా సరే.. రోజుకు ఒక అరగంట జాగింగ్ చేస్తే చాలు.. ఫిట్ నెస్ వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

morning jogging vs evening jogging health tips telugu
అయితే.. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే.. జాగింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయం పూట చేయాలా? రాత్రి పూట చేయాలా? అనే డౌట్లు వస్తుంటాయి. కొందరికి ఉదయం పూట జాగింగ్ చేయడం ఇష్టం ఉండదు. అలాగే.. కొందరు ఉదయం పూట అంత త్వరగా లేవరు. అటువంటి వాళ్లు సాయంత్రం పూట జాగింగ్ చేయాలని అనుకుంటారు. మరి.. ఉదయం పూట జాగింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయా? లేక సాయంత్రం పూట జాగింగ్ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

morning jogging vs evening jogging health tips telugu
Jogging : యాక్టివ్ గా ఉండాలంటే.. సాయంత్రం పూట జాగింగ్ చేయాలట
ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. ఉదయం పూట కంటే.. సాయంత్రం పూట జాగింగ్ చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుందట. ఎక్కువగా యాక్టివ్ గా ఉండాలంటే.. ఉదయం కంటే.. సాయంత్రం పూట జాగింగ్ చేయాలట. అలా అని ఉదయం పూట జాగింగ్ చేయకూడదని కాదు. ఉదయం పూట జాగింగ్ చేసినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ.. సాయంత్రం చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట.

morning jogging vs evening jogging health tips telugu
సాయంత్రం పూట జాగింగ్ చేసినా.. కసరత్తులు చేసినా.. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుందట. అయితే.. రోజుకు కనీసం 30 నుంచి 90 నిమిషాల పాటు జాగింగ్ చేయాలట. ఒకవేళ రోజూ నడవడం కుదరకపోతే.. వారంలో కనీసం రెండున్నర గంటలు నడవాలట. ఒకవేళ బరువు తగ్గడం కోసం వాకింగ్ చేయాలనుకుంటే మాత్రం.. రోజుకు కనీసం గంట నుంచి గంటన్నర పాటు వాకింగ్ చేయాలట. ఒక అరగంట నడిస్తే.. 100 నుంచి 300 కేలరీలు ఖర్చవుతాయి. అలాగే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దాని వల్ల బరువు తగ్గడంతో పాటు.. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఉదయం అల్పాహారంగా దీన్ని తింటే.. ప్రాణాలకే ప్రమాదం..!
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండితో చేసిన రోటీలను ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమౌతుంది? షుగర్ ఉన్నవాళ్లు అసలు ఎగ్స్ తినొచ్చా? తినకూడదా?