Black Pepper : వర్షాకాలంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే… వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి…!!
ప్రధానాంశాలు:
Black Pepper : వర్షాకాలంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే... వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి...!!
Black Pepper : వర్షాకాలం వచ్చింది అంటే చాలు చాలా మంది ఎక్కువగా జలుబు మరియు దగ్గు బారిన పడుతూ ఉంటారు. అయితే ఇటువంటి పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవాలి అంటే నల్ల మిరియాలు తీసుకోవాలి. ఈ నల్ల మిరియాలు చాలా చక్కగా పని చేస్తాయి. ఈ నల్ల మిరియాల లో యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ అలెర్జిక్,యాంటీ గ్యాస్, యాంటీ బ్యాక్టీరియల్, డైయూరిటిక్, డైజెస్టివ్ లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థను మరియు రోగనిరోధక శక్తిని కూడా బలంగా చేస్తాయి…
వర్షాకాలంలో మిరియాలతో చేసిన కషాయం తాగటం వలన జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలకు వెంటనే ఉపశమనం పొందవచ్చు. అంతేకాక మిరియాలు నమిలి తీసుకోవడం వలన గొంతునొప్పి సమస్య నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే బరువు తగ్గించుకోవటానికి చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయితే మీరు కూడా ఊపకాయ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే దానిని తగ్గించుకునేందుకు మిరియాలు ఆహారంలో చేర్చుకోండి…
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, మీ రోజు వారి ఆహారంలో మిరియాలను కచ్చితంగా చేర్చుకోవాలి. ఈ మిరియాలు అనేవి కీళ్ల నొప్పులు మరియు వాపుల నుండి కూడా వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ మిరియాల లో ఉన్న యాంటీ అలెర్జిటిక్ మరియు అర్థరైటిస్ గుణాలు నొప్పి మరియ మంటను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి