Cancer : ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది తెలుసా ..!!
Cancer : ప్రస్తుత కాలంలో క్యాన్సర్ బారిన పడి చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనం తినే ఆహారం వలన ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. అందుకే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. మాంసాన్ని ఎక్కువగా ఉడికించిన అవి క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది కణాల డిఎన్ఏ ను మార్చగలదు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్రై చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన కొన్నిసార్లు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. వంట కోసం వేడిచేసిన వంట నూనెను మళ్ళీ ఉపయోగించకూడదు. దాని వలన క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఎక్కువ ప్రాసెస్ చేసిన మాంసం, సాసేజ్ చేసిన ఎరుపు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వలన కొన్నిసార్లు క్యాన్సర్ ప్రమాదానికి గురిచేస్తుంది.
ఉప్పు చేపల్లాంటి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్కు కారణం అవుతాయి. గొడ్డు మాంసం, మటన్ వంటి రెడ్ మీట్లను ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, ఎక్కువ చక్కెర, ఇతర రసాయనాలను కలిగి ఉన్న కూల్ డ్రింక్స్, ఎక్కువ తీపి ఉన్న ఆహారాలు కూడా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే విపరీతమైన మద్యపానం కూడా కొన్నిసార్లు క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మద్యం కూడా మితంగా త్రాగాలి. ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి మంచిదిష హైడ్రోజనెట్ ఫ్యాట్స్ బదులు నెయ్యి, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె వాడటం మంచిది.
ఎనర్జీ డ్రింక్స్ అసలు తాగకుండా ఉండటమే మంచిది. అలాగే బాగా వేడిగా ఉండే ఆహారం కూడా తినడం వద్దు. సిగరెట్, బీడీ వంటివి కాల్చవద్దు. పొగాకు ఉత్పత్తులు కూడా క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. ఎండలో ఎక్కువగా తిరగకూడదు. సూర్య రష్మీ నుంచి రక్షణ అవసరం. వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించాలి. క్యాన్సర్ను అరికట్టేందుకు ముఖ్యంగా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. శారీరక వ్యాయామం తప్పనిసరి. పిల్లలకు పాలు ఇవ్వడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది. హైపటైటిస్ బి, హెచ్ఐవి సోకకుండా చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించాలి. అలాగే పెద్దవాళ్లు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లలో ఎప్పటికప్పుడు పాల్గొంటూ ఉండాలి.