Coffee : మీరు కాఫీ ఎక్కువగా తాగుతున్నారా.? అయితే మీ ఆరోగ్యానికి ముప్పు కొని తెచ్చుకున్నట్టే…!
Coffee : కాఫీ, టీ లకు చాలామంది బాగా ఆడిక్ట్ అయిపోతూ ఉంటారు. మరికొందరు అయితే ఉదయం లేవగానే టీ కాఫీలతో వాళ్లు మొదలవుతారు. అంత అలవాటుగా మారిపోతూ ఉంటారు. సహజంగా ఒక మనిషి రోజుకి రెండు కప్పుల కంటే కాఫీ తీసుకోవడం అస్సలు మంచిది కాదు.. 250 లీటర్ల కెఫిన్ తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ దీనికంటే అధికంగా త్రాగితే ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే… ఒక్కమాటలో తెలియజేయాలంటే అతిగా తింటే ఏదైనా విషం గా మారుతూ ఉంటుంది. కావున మీరు ఎంతో ఇష్టంగా తీసుకునే టీ ,కాఫీలు మినహాయింపు కాదు. చాలామంది కాఫీకి బాగా అలవాటు అవుతూ ఉంటారు. కాఫీ తీసుకోవడం వలన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ కాఫీ అధికంగా తీసుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కావున శరీరానికి హాని కలిగించకుండా రోజుకి ఎంత తీసుకోవాలి
అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం చాలా ప్రధానం; కాఫీ అధికంగా తీసుకుంటే కలిగే ప్రమాదాలు గురించి తెలుసుకుందాం.. కాఫీలో అధిక మొత్తంలో కెఫెన్ ఉంటుంది. ఇది మెదడుని ఉత్తేజ పరిచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో నిద్రలేమి కి సమస్యకు దారితీస్తుంది. కాఫీ తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ అనే హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. ఇది ప్రేగు కార్యకలాపాలను అధికం చేయడానికి ఉపయోగపడుతుంది .దానివల్ల కాఫీ అధికంగా తీసుకోవడం వలన కడుపు నొప్పి లాంటిది వస్తూ ఉంటాయి. కెఫిన్ అధికంగా ఉంటుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకలు కూడా దెబ్బతింటు ఉంటాయి. కాఫీని అధికంగా తీసుకునే వారిలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటాయి. అదేవిధంగా కార్డియో సమస్యలు కూడా వ్యాపిస్తు ఉంటాయి. కావున కాఫీని అధికంగా తీసుకోవడం మంచిది కాదు..
హై బీపీ లేదా హైపర్ టెన్షన్ సమస్యలు అధికమో అవడానికి కూడా ఈ కాఫీ మూల కారణమవుతుంది. కాఫీలో ఉండే కేఫన్ బ్లడ్ ప్రెజర్ లో ఇబ్బందుల్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. కావున అతిగా కాఫీ తీసుకోవడం అసలు మంచిది కాదు. కాఫీ తీసుకోవడం వలన డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా కాఫీ త్రాగడం మంచిది. కానీ రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాపీ మాత్రమే తీసుకోవాలి. అయితే ఇంతకంటే ఎక్కువ కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి కొన్ని సమస్యలు తప్పవు.. కాఫీ అధికంగా తీసుకోవడం వలన నిద్రలేమి కలుగుతుంది. సహజంగా ఒక మనిషి రోజుకి రెండు కప్పుల కంటే కాఫీ తీసుకోవడం అసలు మంచిది కాదు..రెండు 250 మిల్లీలీటర్ల కెఫిన్ తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ దీనికంటే అధికంగా కాఫీ తీసుకుంటే కడుపులో యసిడ్స్ పెరిగిపోవడం గుండె ఇరేగ్యులర్గా కొట్టుకోవడం లేదా వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.