Health Tips : కొలెస్ట్రాల్, ఊబకాయంతో బాధపడుతున్నారా.? విదేశీ ఫుడ్ తినండి చాలు… కొన్ని రోజులలోనే మార్పు…!!
Health Tips : చాలామంది ఊబకాయం, కొలెస్ట్రాల్ తో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి కారణం సరియైన ఆహారం తీసుకోకపోవడం సరైన శారీరిక శ్రమ లేకపోవడం ఎలా కొలెస్ట్రాల్ ఊబకాయం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ప్రజలలో ఆందోళన ఎక్కువవుతుంది. ప్రధానంగా చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం వలన ఈ సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకు ఇటువంటి ఆహారం అవసరం, ఇది చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. స్థూలకాయం పెరగడానికి అనుమతి ఇవ్వదు. అయితే ఆవిస గింజలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆహారంలో వీటిని చేర్చుకోవడం వలన చలికాలంలో కూడా మనల్ని మనం ఫిట్గా మార్చుకోవచ్చు.. ఈ అవిస గింజల తీసుకోవడానికి ముందు వాటిని ఎండబెట్టి పొడి చేయాలి.
దాని తర్వాత మీరు వేడి నీటిలో ఒక చెంచా పొడిని కలపాలి. లేదా మీరు ఆ గింజలను రాత్రిపూట నానబెట్టి కూడా ఉంచవచ్చు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ విత్తనాలను పచ్చిగా తీసుకోవచ్చు. ఆ గింజలను సూచించిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఎక్కువ పదార్థాలు తీసుకోవడం కూడా మనకి హాని కలిగిస్తూ ఉంటుంది. వాత దోషం తగ్గిపోతుంది.. ఆయుర్వేదం ప్రకారం అవిస గింజల తీసుకోవడం వలన శరీరంలోని వాతదోషం నియంత్రించబడుతుంది. దాని వలన కండరాలు, కీళ్ల నొప్పుల నుండి మీరు చాలా ఉపశమనం పొందుతారు. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణం వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.
వీటిని తీసుకోవడం వలన మన శరీరం శక్తివంతంగా మారుతుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్ నుండి కూడా బయటపడవచ్చు.. అవిస గింజలు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు : మీకు తెలిసిన వాళ్ళకి అధిక రక్తపోటు సమస్య ఉంటే అప్పుడు వారిని ఆవిస గింజలు తీసుకోవాలి అని చెప్పండి. ఆ గింజలలో ఉండే పోషకాలు రక్తపోటుని నార్మల్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పొట్ట చాలా సేపు నిండుగా అనిపిస్తుంది… అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకున్న చాలా సేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది శరీరానికి వెచ్చదనాన్ని, పోషణ ఇస్తుంది. దీంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆకలి బాధలను ఎల్లవేళలా కంట్రోల్లో ఉంచడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి…