Summer : సమ్మర్ కదా అని చెప్పి ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగారంటే…. క్యాన్సర్ ముప్పు… తాజా అధ్యయనంలో…?
ప్రధానాంశాలు:
Summer : సమ్మర్ కదా అని చెప్పి ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగారంటే.... క్యాన్సర్ ముప్పు... తాజా అధ్యయనంలో...?
Summer : ఎండాకాలం కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరూ లేరు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా యువతరం కూల్ డ్రింక్స్, స్వీట్ డ్రింక్స్ అంటూ తీపి పానీయాలకు బానిసల వుతున్నారు. టి వల్ల కలిగే అనర్ధాలు గురించి తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జాగా జరిగిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజు ఒక తీపి పానీయం తాగితే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. నోటి కుహరాలలో ఏర్పడే క్యాన్సర్ మహిళలో వేగంగా పెరుగుతుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో వెళ్లడయింది. ముఖ్యంగా పొగ త్రాగరాన్ని, మద్యం సేవించని యూతుల్లో ఈ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు కావడం వైద్య నిపుణులకు సైతం ఆందోళనకు గురిచేస్తుంది. దీని ప్రధాన కారణం ఆహారపు అలవాటు లేనని పరిశోధకులు చెబుతున్నారు.

Summer : సమ్మర్ కదా అని చెప్పి ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగారంటే…. క్యాన్సర్ ముప్పు… తాజా అధ్యయనంలో…?
Summer తీపి పానీయాలే ప్రధాన కారణమా
జమా ఓటోలారీనాజ్జలజీ – హెడ్ అండ్ నెక్ సర్జరీ జనరల్ లో ప్రసరించబడినది. ధ్యానం ప్రకారం తీపి పానీయాలకు పెద్ద పేగు, జీర్ణాశయాంతర క్యాన్సర్ తో సంబంధం ఉందని తెలిపింది. కానీ తల మెదడు క్యాన్సర్లతో వాటి సంబంధం పై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాలు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నోటి కుహర క్యాన్సర్ : రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్ కంటే తక్కువ. ప్రతి సంవత్సరం 100,000 మందికి 4-4.3 కేసులు నమోదవుతున్నాయి. అయితే, పొగత్రాగని, మద్యం సేవించని మహిళలలో నోటికొహర క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అని అధ్యయన ప్రధాన రచయిత. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఓటోలారీనాజ్జిలాజీ హెడ్ అండ్ నెక్ సర్జరీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రిటన్ ఈ బార్బర్ పేర్కొన్నారు. తీపి పదార్థాలు నేరుగా క్యాన్సర్ కు కారణం కానప్పటికీ, వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబకాయం వస్తుంది. ఉబకాయం అనే కారకాల క్యాన్సర్లకు ముఖ్యంగా నోటికి ఆన్సర్ కు ప్రధాన ప్రమాద కారణంగా అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు, తీపి పానీయాలు ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో మంట, డయాబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
Summer నోటి క్యాన్సర్ అంటే ఏమిటి
క్యాన్సర్ మీ నోటి లోపల ఏర్పడుతుంది. ఇది పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గలు, నోటిపై కప్పు లేదా నోటి దిగువ భాగంలో ఎక్కడైనా సంభవించవచ్చు. సాధారణంగా నోటిలో వచ్చే సమస్యలాగే ఇది కూడా మొదలవుతుంది. తెల్లటి మచ్చలు లేదా రక్తస్రావం అయ్యే పుండ్లు వంటివి కూడా కనిపిస్తాయి. కానీ సాధారణ సమస్యలకు,క్యాన్సర్ కు మధ్య తేడా ఏమిటంటే, ఈ మార్పులు రెండు వారాల్లో తగ్గవు. చికిత్స చేయకుండా వదిలేస్తే, నోటి క్యాన్సర్ మీ నోరు, గొంతు నుండి తల, మెడలోని ఇతర భాగాలకు వ్యాప్తిస్తుంది. అభిప్రాయ ప్రకారం, నోటికొర క్యాన్సర్ నిర్ధారణ అయిన, ఐదేళ్ల తర్వాత 63 శాతం మంది మాత్రమే జీవించి ఉన్నారు. క్యాన్సర్ నీ ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా అవసరం.
Summer నోటి క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు
నోటి క్యాన్సర్ కు సంబంధించిన అనేక సంకేతాలు, లక్షణాలు సాధారణ సమస్యలు లేదా నోటిలో వచ్చే మార్పులు పొరబడే అవకాశం ఉంది. పెదవిపై లేదా నోటిలోపల పుండ్లు సులభంగా రక్తస్రావం అవుతాయి. రెండు వారాల్లో నయం కావు. నోటిలో కారణం లేకుండా రక్తస్రావం అవడం. ముఖం, మెడపై లేదా నోటిలో తిమ్మిరి, నొప్పి లేదా సున్నితత్వం కనిపించడం. నమలడం లేదా మింగడం, మాట్లాడడం లేదా దవడ లేదా నాలుకను కదిలించడంలో ఇబ్బంది. లేదా బరువు తగ్గడం. దీర్ఘకాలిక దుర్వాసన రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి, వీటిని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం. అనారోగ్యాల పాలు చేస్తున్న తీపి పానీయాలు తాగడం తగ్గించండి. యోగ్యకరమైన ఆహారం తీసుకోండి. నోటి ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. నోటిలో ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి. జాగ్రత్తలు తీసుకుంటే నోటి క్యాన్సర్ ముప్పును నివారించవచ్చు.