Winter : చలికాలంలో వీటిని తిన్నారంటే మీ దగ్గరికి ఎలాంటి వ్యాధులు దరిచేరవు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Winter : చలికాలంలో వీటిని తిన్నారంటే మీ దగ్గరికి ఎలాంటి వ్యాధులు దరిచేరవు…!

 Authored By aruna | The Telugu News | Updated on :30 October 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  చలికాలంలో వీటిని తిన్నారంటే మీ దగ్గరికి ఎలాంటి వ్యాధులు దరిచేరవు.

  •  చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం భేష్‌

Winter : చలికాలం వస్తూ వస్తూ అనేక వ్యాధులను వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో కాస్త క్లిష్టమైన వాతావరణ పరిస్థితిలు ఉంటాయి. శరీరంలో వేడి తగ్గిపోతుంది. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ… అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ జీవక్రియను సక్రమంగా చురుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. చలికాలంలో శరీరంలో వేడి తగ్గకుండా రోగాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. మిరియాలు చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి బాడీలో వేడిని పెంచుతాయి. ప్లూ, జలుబు వంటి బారిన పడకుండా ఇందులోని ఆమ్ల జలకాలు కాపాడతాయి. అందువల్ల రోజు తీసుకునే ఆహారాల్లో మిరియాలు ఉండేలా చూసుకోండి. వీటిలో యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఒంట్లో వేడిని పెంచుతాయి. మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. సగం టీ స్పూన్ మెంతులను తీసుకొని వాటిని రాత్రంతా నానబెట్టండి.

మరుసటి రోజున పేస్టు మాదిరిగా చేసుకోండి. దీంతో మీకు జలుబు సమస్య అనేది రాదు. ఇక తులసిలో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడతాయి. అలాగే అల్లం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. అంతేకాకుండా అల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే తులసి అల్లం కలిపి తయారు చేసే టి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీ చలికాలం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఐదు నుంచి ఆరు దాకా తులసి ఆకులు తీసుకోండి. వాటిని మొత్తం పేస్టు మాదిరిగా చేసుకోండి. దీంతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను బాగా తోడ్పడతాయి. వీటిలో మెగ్నీషియం, సెలీనియంతో పలు మినరల్స్ ఉంటాయి. రోజువారి తీసుకునే ఆహారంలో ఓట్స్ బార్లీ క్వినో వంటి తృణధాన్యాలు చేర్చుకుంటే మంచిది. ఇవి వింటర్లో పలు సీజనల్ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పసుపు బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని రోజు కాస్త గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పడిన కలుపుకుని తాగితే చాలా మంచిది. తేను కూడా బాడీలో వేడిని పెంచుతుంది. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. చలికాలంలో రెగ్యులర్గా తేనె తీసుకుంటూ ఉండడం మంచిది. చిటికెడు దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలుపుకొని తాగితే ఈ చలికాలంలో మీరు కొన్ని రకాల వ్యాధులు బారిన పడకుండా ఉండొచ్చు. దాల్చిన చెక్క కూడా శరీరంలో వేడిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. మీరు రెగ్యులర్గా గ్రీన్ టీ తాగుతున్నట్లయితే అందులో కాస్త దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగండి. ఇది మీ బాడీలో హీట్ పెంచుతుంది. వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. నువ్వులు కూడా శరీరాన్ని వేడిగా ఉంచుతాయి.

అలాగే న్యూమోనియా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా నువ్వులు మంచి శక్తినిస్తాయి. ఇవి జీర్ణ క్రియలు మెరుగుపరుస్తాయి. రోజు మీరు తీసుకునే ఆహారాల్లో నువ్వులు ఉండేలా చూసుకోండి. జలుబు దగ్గు వంటి వ్యాధులు సోకకుండా కుంకుమపువ్వు బాగా ఉపయోగపడుతుంది. రోజు గ్లాసు పాలలో కాస్త కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే చాలా మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది