Eyesight : రోజు ఈ పండు తిన్నారంటే వారంలో కచ్చితంగా మీ కంటి చూపు మెరుగుపడుతుంది…!
Eyesight : ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కంటిచూపు తగ్గిందని కళ్ళ అద్దాలు పెట్టుకుంటున్నారు. ఇలా ప్రతి నలుగురిలో ఒకరికి కళ్ళజోడు ఉండడం సర్వసాధారణ అయిపోయింది. కంప్యూటర్స్ మొబైల్ వాడకం ఎక్కువ అవడం వలన పిల్లలు పెద్దలు ఇలా కళ్ళద్దాలను వాడవలసి వస్తుంది. ఎందుకంటే వీటిని ఎక్కువగా చూడటం వలన కంటి లోపల నరాలు బలహీనమై కంటిచూపు మందగించే అవకాశం ఏర్పడుతుంది. అయితే మన పూర్వీకులు మాత్రం కళ్ళజోడు లేకుండానే సక్సెస్ గా జీవనాన్ని సాగించేవారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఈ కంటి సమస్యలు మనం చాలా మందిలో చూస్తున్నాం. వీటికి కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం ఇంకా ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు.. అయితే ఇప్పుడు ఈ కంటి చూపు మెరుగుపరచడానికి తాజాగా ద్రాక్ష తినడం వల్ల కళ్ళకి చాలా మేలు చేస్తుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు.
వారంలో కంటిచూపు మెరుగుపడుతుంది…
ప్రతిరోజు ఈ ద్రాక్షాను తీసుకోవడం వలన అందరిలో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరంలో తగినంత ఆంటీ ఆక్సిడెంట్లు లేనందువలన కళ్ళకణాలు దెబ్బతింటాయి. కేవలం వారంలో రోజుకి రెండు కప్పుల ద్రాక్ష తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ప్రతిరోజు ద్రాక్ష తీసుకోవడం వలన కంటి సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది. ద్రాక్షాలు నిత్యం తినేవారిలో సహజ మరణం 4 లేదా 5 ఏళ్ల పాటు వాయిదా పడుతుంది..
గుండెను ఆరోగ్యంగా ఉండటంతో పాటు తలనొప్పి రాకుండా అడ్డుకుంటుంది. ద్రాక్షను తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ద్రాక్ష మెటబాలిజం సిస్టం ను తగ్గిస్తుంది..
ద్రాక్ష అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీనిలో కేలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని తిన్న పొట్ట నిండిన భావన ఉంటుంది..కాబట్టి బరువు తగ్గడానికి సులభంగా ఉంటుంది.. ద్రాక్ష తినడం వల్ల కంటి సమస్యలు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తక్కువ ధరలో దొరికే ద్రాక్షాలను ప్రతి రోజు ఒక కప్పు తీసుకొని మీ కంటి చూపుని మెరుగుపరచుకోండి..