Brain : ఈ చెడు అలవాట్లు ఉంటే… మీ మెదడు డేంజర్ లో పడ్డట్లే… బకెట్ తన్నేస్తారు…?
ప్రధానాంశాలు:
ఈ చెడు అలవాట్లు ఉంటే... మీ మెదడు డేంజర్ లో పడ్డట్లే... బకెట్ తన్నేస్తారు...?
Brain : మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మెదడు Brain కూడా కీలకమైన అవయవం. మెదడు Brain పనితీరు బాగుంటేనే మన ఆలోచనలు, భావోద్వేగాలు,జ్ఞాపకశక్తి మరియు నిర్ణయాలు వంటివి మన మెదడు నియంత్రణలోనే ఉంటాయి. అయితే మనం మెదడు సరిగ్గా పని చేయకుండా ఉండడానికి కారణం మనం రోజు చేసే పనులు మరియు కొన్ని చెడు అలవాటులో వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యం క్షమిస్తుంది. అలాగే మెదడు శక్తి కూడా తగ్గుతుంది. దీర్ఘకాలికంగా ఆల్జీమర్స్, డెమో షియా వంటి సమస్యలు కూడా దారి తీస్తాయి. మెదడు యొక్క అలవాటులో దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం…

Brain : ఈ చెడు అలవాట్లు ఉంటే… మీ మెదడు డేంజర్ లో పడ్డట్లే… బకెట్ తన్నేస్తారు…?
Brain : నిద్రలేమి సమస్య
చాలామంది కూడా నిద్రించే సమయం టైము పాటించరు. దీనివల్ల నిద్ర లేని సమస్య వస్తుంది. రోజు తగినంత నిద్రపోతే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్ కారణంగా పని ఒత్తిళ్ల వల్ల నిద్ర అనేది టైంకి ఉండడం లేదు. తద్వారా నిద్రలేమి తనం వస్తుంది. రాత్రిలో ఎక్కువసేపు మేలుకోని ఉండడం. మరలా ఉదయాన్నే లేవడం. రోజువారి పనులు చేసుకోవడానికి చాలా నీరసించి పోతారు. తద్వారా మెదడు యొక్క పనితీరు కూడా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత వంటి సమస్యలకు పరిష్కారం నైపుణ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రోజుకు సగటు ఒక వ్యక్తి కనీసం ఏడు నుంచి 8 గంటల నిద్రపోవాలి. అంతేకాదు సరైన ఆహారం కూడా తీసుకోవాలి. టైం టు టైం భోజనం చేయాలి. అలాగే టైం టు టైం నిద్ర కూడా పోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతే మెదడుకు హాని జరిగి మెదడు పనితీరు దెబ్బ తినే ప్రమాదం ఉంది. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటే మెదడు పనితీరు మందగిస్తుంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనిచేసే తీరుకి చాలా మంచిది.
Brain సరియైన వ్యాయామం లేకపోవడం
రోజుల్లో శారీరక శ్రమ అనేది చాలా తగ్గిపోతుంది ప్రజల్లో. దీనివల్ల నా మెదడకు రక్తప్రసరణ సరిగా జరగదు. ఇది మెదడులో కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. మెదడుకి ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చాలా అవసరం. ఇలా చేస్తే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిళ్లు మెదడు కణాలను దెబ్బతీస్తాయి. తద్వారా మెదడు యొక్క జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గుతుంది. దీనివలన ఆభయాందోళనలు, నిరాశకు దారితీస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, యోగ, వ్యాయమాలు వంటివి చేయాలి. అలాగే ప్రతి రోజు కూడా తగినంత నీరు త్రాగాలి. లేకుంటే మెదడు యొక్క పనితీరు మందగిస్తుంది. ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల మెదడు యొక్క కణాల ఆరోగ్యం కాపాడబడుతుంది. ఈరోజు కూడా మనిషి కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.
Brain ధూమపానం మరియు మద్యపానం
కొంతమంది దురాలవాట్లకి బానిసైపోతారు. అందులో ధూమపానం మద్యపానం. ఈ రెండు కూడా చాలా ప్రాణాంతకరం. ధూమపానం,మద్యపానం మెదడు కణాలను నాశనం చేస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని తగ్గించడమే కాదు అనేక మానసిక సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. ఒంటరితనం వల్ల మెదడు పనితీరు ఇంకా మందగిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుటకు మంచి అహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలి. ఎక్కువసేపు స్క్రీన్లు చూస్తే నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ఏ కంటి సమస్యలను కూడా ఎక్కువ చేస్తుంది. మెదడు పనిచేసే తీరు కూడా మందగిస్తుంది. సాధారణంగా మనం అలవాటుగా చేసుకున్న కొన్ని విషయాలు మన మెదడును ఆరోగ్యంగా ఉంచవు. ఇవి మన చేతుల్లోనే ఉంది. ఇది మన చేతుల్లోనే ఉన్న, కొందరు మార్చుకునే ప్రయత్నం అసలు చేయరు. మార్చుకోకపోవడం వల్ల మెదడు యొక్క పనితీరు పూర్తిగా మందగిస్తుంది. ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉంటే మెదడువు సురక్షితంగాను,చురుగ్గాను ఉంచుకోవచ్చు. మన జీవనశైలిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం వల్ల మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనం రోజు తినే ఆహారపు అలవాట్లు కూడా మంచిగా ఉండాలి అప్పుడే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చెడు అలవాట్లు నువ్వు మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ మెదడును కాపాడుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మెదడును చురుగ్గా, జ్ఞాపకశక్తిని పెంచుకోవడం, కొన్ని వ్యాయామాలు చేయడం ఇవన్నీ చేస్తే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరిగి, ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది. ఆలోచించే శక్తి పెరిగితే మన జీవితంలో అనుకున్నవన్నీ సాధించవచ్చు.