Mosquitoes : ఇది వాడితే దోమలు మీ ఇంటి దరిదాపులకు కూడా రావు…!
Mosquitoes : మీకు తెలుసు కదా వర్షాకాలం మొదలయిపోయిందని… వర్షాకాలం వర్షాలతో పాటు దోమల్ని కూడా తీసుకొస్తుంది. అనేక రకాల రోగాలు మనకు రావడానికి అవకాశం ఉందిఅని స్వయంగా డాక్టర్లు చెప్పారు. కాబట్టి వీలైనంత త్వరగా నివారించాలి. ఈ దోమలను నివారణ కోసం ఒక చిట్కా చెప్తాను అన్నాను కదా దానికోసం మనకు వేపాకు, ఎండిన ఉల్లిపాయ తొక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అలాగే కొంచెం కర్పూరం తీసుకోవాలి. అంటే ఆ చిట్కా చెప్పాను కదా ఆ చిట్కా ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను. ఒకరోజు వేపాకులు ఎండబెట్టిన తర్వాత అవి పూర్తిగా ఎండిపోయి పొడిపొడిగా తయారైపోతాయి. కొంచెం చేత్తో పట్టుకుని నలిపితే పొడి పొడి లాడుతాయి. అలా అయిన వాటిని తీసుకోండి.
ఇప్పుడు ముందే చెప్పినట్టుగా కొన్ని ఎండిన ఉల్లి తొక్కలు కూడా తీసుకోండి. ఎండిన వాటితోనే దోమలు దూరంగా వెళ్లిపోతాయి. కాబట్టి కొన్ని బిర్యానీ ఆకులు అలాగే కర్పూరం చిన్న ఉండలు ఉంటే ఒక నాలుగు లేదా ఐదు తీసుకోండి. లేదు పెద్దవి ఉంటే మాత్రం ఒక రెండు సరిపోతాయి. వాటితో పాటు కొన్ని లవంగాలు కూడా తీసుకోవాలి. ఈ లవంగాల వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత అది పొడి లా తయారవుతుంది. ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మన ఒంటిలోని ఎన్నో రోగాలను దూరం చేస్తుంది.
మీ ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదా.. దీపావళి రోజు మనం దీపాలు దీంతోనే పెడతాం.. కాబట్టి అందరి ఇళ్ళలోనూ ఈ ప్రమిదలనేవి ఉంటాయి. కాబట్టి ఆ ప్రమిదలను తీసుకోండి. ఒక ప్రమిదలో కొంచెం మనం తయారు చేసుకున్న పొడిని వేయండి. ఇప్పుడు దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా మీరు ఏ నూనె వాడితే ఒక స్పూన్ తో కలపండి. ఇప్పుడు ఒక చిన్న క్లాత్ ముక్కను బాగా చుట్టి ఈ ప్రమిదలో పూర్తిగా తడపండి. ఇప్పుడు దీనిని మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన దీనిని పెట్టి వెలిగించండి. అప్పుడు చూడండి. అద్భుతం కొంచెం సేపటికి వాసనకు దోమలు దరిదాపుల్లోకి కూడా రావు. ఇది చాలా అద్భుతమైన చిట్కా. ఇది చాలా మంది ప్రాక్టికల్గా చేసి చూపించారు.
దీన్ని వాడకం వలన మనకు ఎలాంటి రోగాలు రావు. ఆ మస్కిటో పాయింట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజుల్లో చాలా మంది దోమల కంటే ముందు ఈ మస్కిటో కాయిల్స్ పీల్చే రోగాలు తెచ్చుకుంటున్నారు.. కాబట్టి వీటిని మానేసి ఇప్పుడు చెప్పిన రెమెడీతో మీ ఇంట్లో దోమలన్నీ తరిమికొట్టండి..