Sleep : కంటి నిండా నిద్ర పోవాలంటే…ఈ టిప్స్ పాటించండి…!!

Authored By aruna | The Telugu News | Published on: August 30, 2024, 8:00 am

Sleep : సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలో మన శరీరం తిరిగి శక్తిని తెచ్చుకుంటుంది. దీంతో మనలో కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. అయితే రోజు పడుకునే ముందు ఒకే రకమైనటువంటి పనులు అనగా స్నానం చేయటం మరియు పుస్తకం చదవడం, మంచి మ్యూజిక్ వినడం లాంటివి చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారు అవుతుంది. అంతేకానీ టీవీ మరియు కంప్యూటర్, మొబైల్ ఫోన్ వాడడం వలన నష్టం కలుగుతుంది. అలాగే పడుకునే ముందు మొబైల్ ఫోన్లను దూరంగా పెట్టడం చాలా మంచిది. అంతేకాక ఫోన్ వాడితే మీ నిద్రకు కూడా భంగం కలుగుతుంది. అందుకే పడుకునే టైంలో ఫోన్ చూడడం అనేది మానేయాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే కడుపు నిండా తిన్న వెంటనే గానీ లేక ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం అస్సలు ఎక్కద్దు.

ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. అలాగే వెలుతురు ఎక్కువగా ఉన్న నిద్ర సరిగా పట్టదు. అందువల్ల గదిలోని లైట్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేసుకుని పడుకోవాలి. అంతేకాక చీకట్లో నిద్రకు కావాల్సినంత మెలనిన్ ఉత్పత్తి పెరిగినప్పుడు మంచి నిద్ర అనేది వస్తుంది… మద్యం తాగడం మరియు స్మోకింగ్ లాంటి అలవాట్లు కారణంగా కూడా సరైన నిద్ర అనేది ఉండదు. ఇవి నిద్ర పై నెగటివ్ ప్రభావాలను కూడా చూపుతాయి. అయితే మందు తాగిన వెంటనే నిద్ర అనేది వస్తుంది. కానీ మందు మత్తు దిగినాక మెలకువ వచ్చి నిద్ర అనేది అస్సలు పట్టదు. అంతేకాక పడుకునే ముందు మితంగా సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే మంచిది. అయితే గోధుమ పాస్తా, ఓట్స్,పాల ఉత్పత్తులు, హెర్బల్ టీ లాంటివి తీసుకుంటే మంచి నిద్ర అనేది వస్తుంది. కానీ పడుకునే ముందు టీమరియు కాఫీలు అస్సలు తాగడం మంచిది కాదు. అలాగే గది వాతావరణం కూడా నిద్ర పై ప్రభావాన్ని చూపిస్తుంది.

అలాగే మీ గది మరీ చల్లగా మరియు మరీ వేడిగా కూడా ఉండకూడదు. అలాగే మీ గదిలో మరీ వేడి ఉన్న లేక చల్లగా ఉన్నా కూడా నిద్ర అనేది అస్సలు పట్టదు… బెడ్ రూమ్ ఎంత నిశబ్దంగా ఉంటే అంత మంచి నిద్ర అనేది వస్తుంది. కావున గది ఎంతో నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి సౌండ్ లు కూడా మీ నిద్రకు ఆటంకం కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి.మంచి నిద్రకు మనం పడుకునేటటువంటి బెడ్ రూమ్ కూడా ప్రభావం చూపుతుంది. మీకు గనక మంచి నిద్ర పట్టాలి అంటే అనువైన బెడ్ రూమ్ ని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే మీరు వాడే పరుపు మరియు దిండ్లు అసౌకర్యవంతంగా లేనట్లయితే నిద్ర కూడా సరిగా పట్టదు. మీకు అనుకూలంగా ఉండే పరుపు మరియు దిండ్లు వాడటం చాలా మంచిది…

aruna

No bio available for this author.

  1. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  2. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  3. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  4. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

  5. "Naresh : పెళ్లి వద్దన్నా పర్లేదు.. పిల్లల్ని కనండి..! వివాదంపై వీకే నరేశ్ క్లారిటీ..!"

  6. "Employees Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్‌..!"

  7. "Karthika Deepam 2 Today Episode October 15th : జ్యోత్స్న చనిపోయిందా? మృతదేహం దగ్గర అసలు ట్విస్ట్ ఇదే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp