Immunity Booster Foods : ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ.. బోడ కాకరకాయతో బోలెడంత ఇమ్యూనిటీ పవర్..
Immunity Booster Foods : కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాలు తెగ భయపడిపోతున్నారు. ప్రజెంట్ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో థర్డ్ వేవ్ వచ్చేసే పరిస్థితులు ఉన్నాయని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు అప్రమత్తమవుతున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడంతో పాటు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఇకపోతే కొవిడ్ రాకుండా ఉండేందుకుగాను ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అందుకుగాను తాజా ఆహార పదార్థాలను, కూరగాయలను తీసుకోవాలని అంటున్నారు. కాగా, విటమిన్లు, పోషకాలకు కేరాఫ్ అయిన బోడకాకరకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం శీతాకాలం అవడంతో పాటు కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం తెగ భయపడిపోతున్నారు. కాగా, అధికమైనటువంటి పోషకాలు, విటమిన్స్ ఉండే ఈ బోడకాకరకాయలను తీసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని పెద్దలు వివరిస్తున్నారు. అడవి కాకరాగా పిలవబడే బోడకాకరకాయ అంటే చాలా మంది ఇష్టపడుతారు. దీనిని ‘కంటోలా లేదా వాన్ బిట్టర్ గోర్డ్’ అని కూడా పిలుస్తారు.ఇందులో విటమిన్ బి12, డి, మెగ్నిషియం కాల్షియం, కాపర్, జింక్ వంటి అన్ని పోషకాలు ఉంటాయి.
Immunity Booster Foods : బాడీ దృఢంగా ఉండాలంటే ఈ కూరగాయలను తీసుకోవాల్సిందే..
ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి సాయపడతాయి. విటమిన్స్ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఏ, సీ, డీ2, పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి విటమిన్స్ అన్నీ కూడా హ్యూమన్ బాడీని స్ట్రాంగ్ చేస్తాయి. చాలా మంది బోడ కాకరకాయలను ఇష్టంగానే తీసుకుంటారు. అయితే, కొందరు మాత్రం అడవిలో దొరికే ఈ కూరగాయల వలన ఏదేని ఇబ్బందులు వస్తాయేమో అని భయపడుతుంటారు. కానీ, ఆరోగ్య నిపుణులతో పాటు పెద్దలు చెప్తున్న దాని ప్రకారంగా బోడ కాకరకాయలతో ఆరోగ్యానికి బోలెడంత లాభం కలుగుతుంది.