Whiten Teeth : రెండు నిమిషాలలో ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళైన తెల్లగా మెరిసిపోతాయి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Whiten Teeth : రెండు నిమిషాలలో ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళైన తెల్లగా మెరిసిపోతాయి..!!

 Authored By aruna | The Telugu News | Updated on :29 May 2023,5:00 pm

Whiten Teeth : తెల్లని పళ్ళు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నోరు దుర్వాసన రావడం పళ్ళు తరచుగా ఊడిపోతూ ఉండడం పంటి నొప్పి చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఇలా చాలా రకాల సమస్యలు పంటికి వస్తూ ఉంటాయి. మరి పంటి సంబంధిత సమస్యలకు మన ఇంట్లోనే ఈజీగా దొరికే ఇంగ్రిడియంట్స్ తో ఎలా మన పల్లె రంగును తెల్లగా మార్చుకోవాలి. దానికి ఏమేం చేయాలి? ఎటువంటి ఇంగ్రిడియంట్స్ వాడితే మన పళ్ళు తెల్లగా అందంగా ఆరోగ్యంగా తయారవుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. తెల్లటి దంతాలు కావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పదార్థాలు తినడం వల్ల దంతాలు రంగు మారుతాయి. ఇది రూపాన్ని పాడు చేయడమే కాకుండా నవ్వడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఏ పదార్థాలు తినడం వల్ల దంతాలు పాడవుతాయో ముందుగా తెలుసుకోవాలి. చలికాలం అయినా వేసవికాలం అయినా అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు.

కానీ కొంతమంది టీ ఎక్కువగా తాగుతారు. ఇది దంతాలకంతా మంచిది కాదు. కాఫీ టీ దంతాల మీద చాలా చిరు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇది దంతాలపై ఉండే ఎనామిల్ ని దెబ్బతీస్తుంది. పళ్ళు తెల్లబడడం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ముందుగా దీనికోసం రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇలా వెల్లుల్లిపాయలను రెండు తీసుకుని చిన్న కిచెన్ రోల్ లో మెత్తగా దంచుకోండి. ఇలా దంచినది ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులో పావు టీస్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా మన పంటి గారను పూర్తిగా క్లీన్ చేస్తుంది.అలాగే ఇప్పుడు ఇందులో మనం ప్రతిరోజు ఎంత పేస్ట్ అయితే వాడుకుంటామో అంత పేస్ట్ ని ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక టమాటో తీసుకుని హాఫ్ గా కట్ చేసి నిమ్మకాయ రసం పిండినట్టుగా ఈ టమాటోను ఒక స్పూన్ లోకి రసాన్ని పిండండి.

In a couple of minutes the yellow stucco will shine bright white

In a couple of minutes the yellow stucco will shine bright white

ఇలా ఒక స్పూన్ వరకు రసం వచ్చిన తర్వాత ఈ బౌల్లో వేసి అన్నిటిని మరోసారి బాగా కలపండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి మీరు ప్రతి రోజు బ్రష్ చేసుకోవడానికి ఎంత మోతాదులో బ్రష్ మీద పేస్ట్ అప్లై చేసుకుంటారో అంత మోతాదులో తీసుకుని పళ్ళను బాగా శుభ్రం చేయండి. ఫ్రెండ్స్ పళ్ళను శుభ్రం చేసుకునేటప్పుడు కనీసం మూడు నిమిషాల పాటు అయినా అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో బ్రష్ చేయాలి అంటే పైకి కిందకి బ్రష్ చేయాలి అడ్డంగా బ్రష్ చేయడం వల్ల మీ పళ్ళను ఇరుక్కున్న ఆహార పదార్థాలు అలాగే ఉండిపోతాయి. దాంతో పంటి సంబంధిత సమస్యలు తగ్గవు ఇంకా పెరుగుతాయి. అయితే ఇది రెండు పూటలా మీరు చేయాల్సి ఉంటుంది. ఉదయం అలాగే రాత్రి భోజనం అయ్యి పడుకోవడానికి ముందు కూడా మీ పళ్ళను ఈ రెమెడీతో శుభ్రం చేసుకుంటే గార పట్టిన మీ పళ్ళు తెల్లగా అవుతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా పోతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది