Chapati : చపాతి రాత్రి తినడం మంచిదా.? ఉదయం తినడం మంచిదా..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే…!!
Chapati : సహజంగా చాలామంది లావుగా ఉండడం కారణంగా అలాగే మధుమేహం కారణంగా ఎక్కువగా సాయంత్రం వేళలో చపాతిని తింటూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం కానీ రాత్రి వేళలో కానీ చపాతీల్ని తినేవారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఒక సందేహం ఉన్నది. అది ఏమిటంటే చపాతీని రాత్రి తినడం వలన ఉపయోగమా.. లేదా ఉదయం తినడం వలన ఉపయోగమా? మరి అసలు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు .ఇప్పుడు మనం చూద్దాం.. రాత్రిపూట చపాతి తింటే ఇన్ని నష్టాల.. చపాతీలో చాలా క్యాలరీల శక్తి ఉంటుంది. కావున దానిలో ఉండే పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.
రాత్రి సమయంలో చపాతి తినడం వలన అధిక బరువుకి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే షుగర్ లెవెల్స్ కారణంగా శరీరంలో చక్కెర లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కావున రాత్రి చపాతి తీసుకోవడం వలన అంత మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఒక చిన్న చపాతీలో 71 క్యాలరీల శక్తి ఉంటుంది. రాత్రి భోజనం రెండు రోటీలు తింటే 140 క్యాలరీల శక్తి శరీరానికి అందుతుంది. అయితే చపాతి తో పాటు కూరగాయల సలాడ్ కూడా తీసుకుంటూ ఉంటారు. దాని వలన శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా చేరుతాయి.
దీని మూలంగా బరువు వేగంగా పెరుగుతూ ఉంటారు. ఇక రాత్రి తిన్న తర్వాత నడవకపోతే బరువు అధికంగా పెరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.. *చపాతి వలన నష్టాలు; ఉదయం వేళ చపాతి తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ రాత్రి సమయంలో చపాతి రెండు కంటే ఎక్కువ తీసుకోకూడదు. రాత్రి సమయంలో చపాతి బదులుగా పండ్లు పీచుపదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. మధుమేహం పీసీఓడీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణ క్రియ ను దెబ్బతీస్తుంది. రాత్రి సమయం చపాతీ తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.