Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?
ప్రధానాంశాలు:
Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా... ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు...?
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం ఏంటంటే మన ఇంట్లో వాడే వస్తువులలో తోటీ, ఇంకా వంట సామాగ్రిని నిక్షిప్తం చేసే డబ్బాలలో లాంటివి కూడా మనకి హాని చేస్తాయి. ప్రతి రోజు ఉపయోగించే సాధారణ ఆహార ప్యాకేజింగ్ నుంచి సూక్ష్మ,నానో ప్లాస్టికులు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని ఇటీవల అధ్యయనంలో తేలింది. కిచెన్ లో ఉపయోగించే పోపు దినుసుల దగ్గర నుంచి వినియోగించే ఆహార పదార్థాలు దగ్గర వరకు ప్రమాదాన్ని కలిగించేవి ఉన్నాయి. అవి ప్లాస్టిక్ సీసాలు,ప్లాస్టిక్ ఛాంపింగ్ బోర్డులు, ప్లాస్టిక్ మూతలు,ఉన్న గాజు సీసాలు,ప్లాస్టిక్ టీ బ్యాగులు, మన ఆహారం పానియంలోనికి మైక్రో ప్లాస్టిక్లను విడుదల చేస్తున్నాయి. మైక్రోవేవ్ చేయగల ప్లాస్టిక్ కంటైనర్ లో ఆహారాన్ని వేడి చేయడం కూడా మైక్రో ప్లాస్టిక్ కాలుష్యానికి దారితీస్తుంది.పదేపదే ఉపయోగించటం వేడికి గురు కావడం, మైక్రో ప్లాస్టిక్ సెట్టింగ్ పెరుగుదల వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాలు.

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?
Food ఆహారాలను ఎలా తీసుకోకూడదు
ప్లాస్టిక్లలో ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాలు సూక్ష్మ, నానో ప్లాస్టిక్లతో ఎలా కలుషితమవుతుందో స్వీట్జర్లాండ్ లాబాపేక్షలేని ఫుడ్ ప్యాకేజింగ్ ఫోరమ్ కు చెందిన జీవశాస్త్రవేత్త, లిసా జిమ్మెర్ మాన్ వెల్లడించారు. ఆహారా ప్యాకేజింగ్ వాస్తవానికి ఆహారంలో కలిసే, సూక్ష్మ నానో ప్లాస్టిక్ లకు ప్రత్యక్ష మూలం అని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్ క్యాపులు, ఓపెన్ చేసిన ప్రతిసారి మైక్రో ప్లాస్టిక్ ల సంఖ్య పెరుగుతుందని పరిశోధనలో వెళ్లడైంది. ఇది ఎక్కువగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ద్వారా జరుగుతుందని, శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్లాస్టిక్,కూల్డ్రింక్స్, నీళ్లు ప్యాకేజ్ చేయబడిన బాటిల్స్ కోసం ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి, ఈ బాటిల్స్ వాడిన వెంటనే నలిపి పారేయండి. అధ్యయనాల ప్రకారం.. పరిశోధకులు బీరు, డబ్బా చేపలు, బియ్యం,మినరల్ వాటర్, టీ బ్యాగులు,టేబుల్ సాల్ట్ లు,టేక్ అవుట్ ఫుడ్స్,శీతల పానీయాలు వంటి ఆహార పానీయాలలో ఉత్పత్తుల్లో సూక్ష్మ నానో ప్లాస్టిక్ లోను కనుగొన్నారు.
ఇవాళ శాస్త్ర ఆధారాల ప్రకారం ఆహార సంబంధ వస్తువులు (FCA )లు మిల్లీమీటర్ల నుండి నానో మీటర్ల పరిధిలో, చిన్న ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయని సూచించారు.వీటిని మైక్రో నానో ప్లాస్టిక్స్ (MNP) లు అని పిలుస్తారు. వీటివల్ల భవిష్యత్తులో సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైక్రో ప్లాస్టిక్ వినియోగం వల్లజీర్ణ వ్యవస్థలో వాపు,జీవక్రియ మార్పులు,అవయవ నష్టం వంటివి ఆరోగ్య ప్రమాదాలను సంభవింపజేస్తాయి. మైక్రో ప్లాస్టిక్ కు గురికావడానికి తగ్గించడానికి ఆహారాన్ని నిలువ చేయడానికి, వేడి చేయడానికి, గాజు లేదా శిరామిక్ కంటైనర్లను ఉపయోగించడం, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం, పండ్లు కూరగాయలను పూర్తిగా కడగడం వంటివి అలవాటు చేసుకోవాలి.