Jujube : రేగి పండ్లను తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకొండి..!!
Jujube : రేగిపండ్ల లో బోలెడన్ని వైటమిన్స్ ,మినరల్స్ ఆంటీ ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటుంది. సంక్రాంతి పండగ రోజు పిల్లలకి నెత్తి మీద నుంచి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ఈ పండ్లకు అంత స్పెషాలిటీ ఉంది. కాబట్టి వీటిని తినడం వలన కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సీజన్లో దొరికే రేగి పండ్లు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా […]
ప్రధానాంశాలు:
Jujube : రేగి పండ్లను తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకొండి..!!
Jujube : రేగిపండ్ల లో బోలెడన్ని వైటమిన్స్ ,మినరల్స్ ఆంటీ ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటుంది. సంక్రాంతి పండగ రోజు పిల్లలకి నెత్తి మీద నుంచి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ఈ పండ్లకు అంత స్పెషాలిటీ ఉంది. కాబట్టి వీటిని తినడం వలన కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సీజన్లో దొరికే రేగి పండ్లు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
ఈ రేగుపండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగుపండ్లను తినాల్సిందే.. రేగుపండ్లలో కొన్ని రకాలు ఉన్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లులో పొటాషియం, ఫాస్ఫరస్ ,మాంగనీస్, ఐరన్ జింక్ పోషకాల్ని కలిగి ఉంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. బ్లడ్ షుగర్ నుంచి రేగు పండ్లు కాపాడుతాయి.
రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే రేగుపండ్లు మన శరీరానికి అవసరం. అలాగే ఎండిన రేగుపండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. అర్ధరేటి సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే వారు ఈ రేగు పండ్లు తినడం మంచిది. జ్వరం, జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తరచూ రేగుపండ్లను తినాలి. రేగి చెట్టు బెరడు తో చేసిన కాషాయం మలబద్దక సమస్యలు నివారిస్తుంది.. రేగి ఆకులను నూరి కురుపులు వంటి వాటిపై అప్లై చేస్తే అవి త్వరగా నయంఅవుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి రేగి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.