Lungs : ఇలా చేశారంటే మీ ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టవచ్చు…!
ప్రధానాంశాలు:
Lungs : ఇలా చేశారంటే మీ ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టవచ్చు...!
Lungs : ఇప్పుడున్న కాలంలో అందరూ గజిబిజిగా గడుపుతున్నారు.. ఈ నేపథ్యంలో ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎన్నో మార్పులు కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే ఈ ఆహారపు అలవాట్లు మూలంగా మన శరీరంలో ముఖ్యమైన భాగం ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. ఊపిరితిత్తులు పాడవడంతో ఇతర అనేక జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. మన శరీరంలో లంగ్స్ హెల్తీగా ఉండడం చాలా అవసరం. లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఎక్సైజ్ ను తప్పకుండా చేయాలి.. సరియైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అలాగే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఈ పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పంపింగ్ బ్రీతింగ్ : ఈ పద్ధతిలో ముక్కుతో గాలిని తీసుకుంటూ ఉండాలి. అలాగే గాలితో నోటిని నింపాలి. ఆ తర్వాత కూర్చుని నెమ్మదిగా గాలిని వదలాలి.. ఈ విధంగా ఐదు సార్లు చేయాలి. ఇలా చేసినా కూడా ఊపిరితిత్తులు హెల్దీగా మారుతాయి. మీ ముఖ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది..
మెట్లు ఎక్కడం: ఊపిరితిత్తులు హెల్దీగా ఉండడం కోసం మెట్లు ఎక్కడం దిగడం లాంటివి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసేటప్పుడు మీ శ్వాస తీసుకుంటూ ఉండాలి. దిగేటప్పుడు శ్వాసను నెమ్మదిగా వదలాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఊపిరితిత్తులు అనేది దృఢంగా మారుతాయి…
అవరోహణ ఆరోహణ బ్రీతింగ్ ఎక్సర్సైజ్: ముక్కుతో శ్వాస తీసుకుని నెమ్మదిగా వదిలాలి. మధ్య వేలుతో కుడి నాసికను మూసి రెండవ నాసిక తో తీసుకుంటూ ఉండాలి. అలాగే కుడివైపు నాసిక రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఎడం వైపు నాసికను మూయాలి. ఈ విధంగా ఐదు నుంచి పది సార్లు చేస్తే మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
బ్రీతింగ్ ఎక్సర్సైజ్: డీప్ బ్రీతింగ్ అనేది ఒక అద్భుతమైన ఎక్ససైజ్. ఈ బ్రీతింగ్ చేయాలంటే మొదటగా నిటారుగా కూర్చుని భుజాలను వదులుగా ఉంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగా ఊపిరిని పీల్చుకుంటూ పొట్ట పైకి వచ్చేలా శ్వాస తీసుకుంటూ ఉండాలి. అలాగే తర్వాత నెమ్మదిగా శ్వాసను వదులుతూ ఉండాలి. ఈ విధంగా కనీసం 10 సార్లు అయినా చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడవచ్చు…