Hug : ఒక్క హగ్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలానో తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
Hug : ఒక్క హగ్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలానో తెలుసుకోండి..!
Hug : ప్రేమించిన వారిని కౌగిలించుకోవడం వలన ప్రేమతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మనసుతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం మీరు ప్రేమించిన వ్యక్తిని 20 సెకండ్లు కౌగిలించుకోవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మరి దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Hug : ఒక్క హగ్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలానో తెలుసుకోండి..!
Hug ఒత్తిడి, ఆందోళన తగ్గింపు
ప్రస్తుతం ఉన్న పనుల ఒత్తిడి కారణంగా చాలామంది మనశ్శాంతి ఉండడం లేదు. అయితే ఒక 20 సెకండ్ల పాటు మీరు ప్రేమించిన వ్యక్తిని కౌగిలించుకోవడం వలన ఆ ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు తెలిపాయి. ఎలా అంటే శరీరంలోని ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ విడుదల అవ్వడం వలన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
Hug మానసిక ఆరోగ్యం
మీ భాగస్వామిని లేదా మనకు ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకోవడం వలన మానసిక స్థితి మెరుగుపడుతుందంట. ఇలా చేయడం వలన నమ్మకం పెరగడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉండే ఆనందాన్ని పెంచే హార్మోన్లు విడుదలవుతాయని శాస్త్రీయ పరిశోధనలో వెల్లడించారు.
Hug శారీరక నొప్పి నుండి రిలీఫ్
భావోద్వేగాలకే కాకుండా శరీరానికి కూడా కౌగిలించుకోవడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే శరీరంలో నొప్పిని తగ్గించేటువంటి హార్మోన్లు కౌగిలించుకున్నప్పుడు అవి ఉత్పత్తి అవుతాయి. అనేక రకాల చికిత్సల కన్నా ఇది ఎంతో సహాయపడుతుంది.
Hug గుండె ఆరోగ్యం
నార్త్ కరోలినా యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం చూసుకున్నట్లయితే కౌగిలించుకునేటువంటి వ్యక్తుల గుండె స్పందన సరిగ్గా ఉంటుందని తెలియజేశారు. ఇక కౌగిలించుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది దీని వల్ల గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గుతాయి.
ఒత్తిడి ఎక్కువగా ఉంటే ప్రమాదం : అధ్యయనంలో పాల్గొన్న జంటల గుండె స్పందన నిమిషానికి 10 బిట్స్ ఎక్కువ పెరిగిందని తేలింది. కాబట్టి కౌగిలించుకోవడం వలన ఒత్తిడి స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే మనం ప్రేమించే వారిని కౌగిలించుకోవడం వలన శరీరానికి మనసుకి చాలా మేలు జరుగుతుంది. చాలామంది కౌగిలించుకోవడం వలన జరిగే ప్రయోజనాలు తెలియక దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు.