Brain Health Tips : మెదడు ఆరోగ్యానికి మెరుగుపరిచే నట్స్.. బాదం వాల్ నట్స్ లో ఏది బెస్ట్…!!
ప్రధానాంశాలు:
Brain Health Tips : మెదడు ఆరోగ్యానికి మెరుగుపరిచే నట్స్.. బాదం వాల్ నట్స్ లో ఏది బెస్ట్...!!
Brain Health Tips : మెదడును చురుగ్గా పనిచేసేలా చేయడంలో వాల్ నట్స్ Walnuts మరియు బాదం ముందుంటాయి. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ,ప్రోటీన్లు ,ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. అయితే పోషక సంప్రదలో రెండు ఒకేలా ఉన్నప్పటికీ వాటి నిర్మాణంలో మాత్రం కొన్ని తేడాలు ఉంటాయి. ఇక వాల్ నట్స్ Walnuts లో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వాల్ నట్స్ లో విటమిన్ సి తక్కువగా ఉంటుంది. ఇక బాదం పప్పులు Almonds మెగ్నీషియం మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు కణాలను రక్షించడంలో ఉపయోగపడతాయి. మరి మెదడు ఆరోగ్యంగా ఉండడం కోసం వీటిలో ఏది తీసుకోవడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
బాదం పప్పులు Almonds కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇక వాల్ నట్స్ లో అయితే ఆరోగ్యకరమైన పాలీఅన్ శాచురేటేడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. కనుక ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది. వాల్ నట్స్ లో అవసరమైన పోషకాలు, ఒమేగా -3 కూడా అధికంగా ఉన్నాయి. అలాగే బాదం పప్పులు Almonds విటమిన్ ఈ మరియు మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.
అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు , పాలీ ఫేనల్స్ ఉన్నందువల్ల ఇవి మెదడు, గుండె ఆరోగ్యాన్ని వాల్ నట్స్ చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. సాధారణ వయసులో జ్ఞాపకశక్తి Memoryని కోల్పోతూ ఉంటారు. అయితే వాల్ నట్స్ ని తరుచు తినడం వలన ఈ సమస్యలను నివారించవచ్చు. అంతేకాకుండా కొన్ని అధ్యయనాలలో ఒమేగా -3 మెదడు జ్ఞాపకశక్తి పని తీరని మెరుగు పరుస్తాయని నిరూపించడం జరిగింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి , ఆక్సీకరణ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.

Brain Health Tips : మెదడు ఆరోగ్యానికి మెరుగుపరిచే నట్స్.. బాదం వాల్ నట్స్ లో ఏది బెస్ట్…!!
బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉండడం వలన ఇది మెదడు కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి లోపాన్ని కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా బాదం పప్పు Almonds తినడం వలన ఏకాగ్రత ఆలోచన పెరుగుతుంది. అలాగే బాదం పప్పులోని ప్రోటీన్లు ఫైబర్ దీర్ఘకాలిక శక్తిని అందించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. బాదంపప్పు వాల్ నట్స్ ఈ రెండు కూడా మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తూ జ్ఞాపకశక్తి ని కోల్పోకుండా సహాయపడతాయి.
బాదం , వాల్ నట్స్ ఈ రెండు కూడా మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలలో నిరూపించబడ్డాయి. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా – 3 , యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఇక ఈ రెండిటిని ప్రతిరోజు తీసుకోవడం వలన మెదడు పనితీరు కు అవసరమయ్యేటటువంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి మెదడు ఆరోగ్యంగా పనులుగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ప్రతిరోజు వాలెట్స్ మరియు బాదం పప్పులు తీసుకోవడం చాలా మంచిదనే నిపుణులు తెలియజేస్తున్నారు