Miriyala Chekkalu Recipe : మిరియాల చెక్కలు కారం కారంగా, క్రిస్పీగా అదిరిపోయే టేస్టుతో…
Miriyala Chekkalu Recipe : ఈరోజు మనం కారం కారంగా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మిరియాల చెక్కలు తయారు చేయబోతున్నాం.. ఇవి రెగ్యులర్గా చేసే చెక్కల్లాగా కాకుండా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మిరియాల చెక్కలకు కావలసిన పదార్థాలు: మినప గుండ్లు, బియ్యప్పిండి, ఉప్పు, మిరియాలు, నీళ్లు జీలకర్ర, ఇంగువ, వెన్న, మొదలైనవి…
మిరియాల చెక్కలు తయారీ విధానం: ముందుగా ఒక కప్పు మినపగుండ్లను వేయించుకొని మిక్సీ జార్లో పొడిచేసి జల్లించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక రెండు కప్పుల బియ్యప్పిండిని కూడా జల్లించుకొని మినప పిండిలో కలుపుకోవాలి. తర్వాత దానిలోకి పావు కప్పు మిరియాలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని దాన్లో కొంచెం జీలకర్ర కూడా వేసి పిండిలో కలుపుకోవాలి. తర్వాత కొంచెం వెన్న, కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకొని తర్వాత నీటిని వేస్తూ గట్టిగా కలుపుకోవాలి.
తర్వాత ఒక 30 నిమిషాల పాటు దీనిని నాననిచ్చి.. తర్వాత ఆ పిండి లోంచి కొంచెం పిండిని తీసి మిగతా పిండిని తడి బట్ట కప్పి ఉంచుకోవాలి. ఇక తీసుకున్న పిండిని ఉండల్లా చేసుకుని ఒక పాలిథిన్ కవర్ ని తీసుకొని దానిపై ఆయిల్ రాసి ఈ పిండి ముద్దుని దానిపై పెట్టి మళ్ళీ కవర్ని కప్పి ఒక ప్లాట్ గిన్నెను తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఫ్రెష్ చేసుకొని ఈ చెక్కలను ఒక బట్టపై పరుచుకోవాలి. ఇలా అన్ని చెక్కలను చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో నాలుగైదు చెక్కలను వేసి ఎర్రగా, క్రిస్పీగా వచ్చేవరకు వేయించి తీసుకోవడమే.. అంతే ఎంతో కారం కారంగా క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ. ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు. ఇవి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి 15 రోజులపాటు నిల్వ ఉంటాయి.