Nail : గోర్లు కొరకడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!
ప్రధానాంశాలు:
Nail : గోర్లు కొరకడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...!
Nail : మనం ఒక్కొక్కసారి గందరగోళం మరియు ఆందోళన,భయం కారణం చేత కొందరు గోర్లను కొరుకుతూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఉన్నవారు ఏ మాత్రం ఒత్తిడి కలిగిన వారి చేతి గోళ్లు నోట్లో పెట్టుకొని నమలడం లేక కొరకడం చేస్తూ ఉంటారు. అయితే చేతి గోర్లు విరిగిపోవడంతో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అయితే గోర్లు కొరికే అలవాటు మీకు కూడా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సాధారణంగా ఆందోళన లేక నెర్వస్ నెస్ కారణంగా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఎంతో మంది గోళ్లను కొరుకుతూ ఉంటారు. ఇలా గోర్లు కొరుకుతూ వారి భావోద్వేగాలను కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది మంచి పద్ధతి కానే కాదు. ఇది ఎన్నో రకాల శారీరక సమస్యలను కలిగిస్తుంది. అందుకే మీరు మీ గోళ్లను కొరికే అలవాటును వీలైనంత తొందరగా మానుకుంటే చాలా మంచిది. అయితే గోర్లు కొరకడం వల్ల శరీరంపై ఏ ఏకమైన చెడు ప్రభావాలు పడతాయి. మీరు గోర్లు కొరకడం వలన గోళ్ళ నిర్మాణం అనేది ఎంతో దెబ్బతింటుంది. అలాగే గోళ్లు కొరకటం వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయి.

Nail : గోర్లు కొరకడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!
మీరు గోర్లు కొరకడం వలన నోట్లో చిగుళ్ళు దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు గోర్లు కొరకడం వల్ల గోరు చుట్టు ఉన్నటువంటి చర్మం కూడా పొడిబారటంతో పాటు పొరలుగా మారి ఊడిపోతూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే గోర్లు కొరకడం వల్ల జీర్ణ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే గోర్లను నమలడం వలన ఎన్నో రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇతర రకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది. అంతేకాక గోళ్లలోని మురికి నోటి లో పేరుకుపోయి జలుబు మరియు ఇతర రకాల అంటూ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున గోర్లు కొరకటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…