Nela Mulaka Plant : బట్టతల పైన తిరిగి వెంట్రుకలు మొలిపించే శక్తి ఉన్న ఈ మొక్క గురించి మీకు తెలుసా..?
ప్రధానాంశాలు:
Nela Mulaka Plant : బట్టతల పైన తిరిగి వెంట్రుకలు మొలిపించే శక్తి ఉన్న ఈ మొక్క గురించి మీకు తెలుసా..?
Nela Mulaka Plant : ఉడిపోయిన వెంట్రుకలను తిరిగి మొలిపించే శక్తి కలిగిన మొక్క,మీ చుట్టుపక్కలే ఉందంటే నమ్మగలరా అవునా అని ఆశ్చర్యపోతున్నారూ. అయితే అంతటి శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకుందామా. ముళ్ళ వంగ మొక్కను అందరూ చూసే ఉంటారు.బిడు భూముల్లో చెరువు కట్ట విరివిగా కనిపించే దీనిని ప్రాంతాలవారీగా నేల వాక్కుడు,నేల మొలకరి,ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. నిలువెల్లా ముళ్ళతో ఉండే ఈ మొక్క ఆకులు పువ్వులు, కాయలు,వేళ్ళు,ఇలా అన్ని భాగాలు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీని కాయల్ని కూరగా వండుకొని తింటారు. బట్టతల,పేలుకొరుకుడు వీటివల్ల జుట్టు ఊడిపోయిన వారు పండి పసుపు రంగులోకి మారిన దీని కాయను సేకరించి బాగా దంచి రసం తీసి ఈ రసంలో తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో కొన్ని రోజులపాటు మర్తనా చేస్తే తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.
అలాగే పక్వానికి వచ్చిన దీని కాయను తీసుకుని మధ్యలోకి కోసి గింజలను తీసివేసి గుజ్జు నుండి రసం తీసి దానికి సమానంగా మందార పువ్వుల రసం కలిపి జుట్టు ఊడిన చోట మర్దన చేసిన చక్కటి ఫలితం కనిపిస్తుంది. మోకాళ్ళ నొప్పులు,నడుం నొప్పి ఉన్నవారు దీని ఆకుల్ని మెత్తగా నూరి దాన్లో కొంచెం వేడి చేసిన వెన్నపూస వేసి నొప్పి ఉన్నచోట కట్టు కడితే నొప్పులు తగ్గిపోతాయి. తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని కాయలను దంచి రసం తీసి దానిని మాడ పైనమర్దన చేస్తే తీవ్రంగా వేధిస్తున్న తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.ఈ కాయలను సేకరించి ఎండబెట్టి దంచగా వచ్చే పొడిని పిలిస్తే పిప్పి పన్నులో ఉన్న పురుగులు చనిపోయి,పిప్పి పన్ను బాధ తగ్గుతుంది.
అలా చేయలేని వారు దీని ఆకుల రసంలో దూది ముంచి నొప్పి ఉన్నచోట అద్దిన మంచి ఫలితం ఉంటుంది.వాకుడు చెట్టు వేరు కు విషాన్ని హరించే శక్తి ఉంది. పాము,తేలు వంటి విష కీటకాలు కుట్టినప్పుడు దీని వేరుని మెత్తగా నూరి దీనికి కొంచెం నిమ్మరసం కలిపి కరచిన ప్రదేశంలో కట్టు కడితే. విష ప్రభావం తగ్గుతుంది.నేల మనకు చెట్టు సమూలాన్ని కాషాయం చేసుకొని పుక్కిటపడితే దంత సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దీని వేర్లను సేకరించి ఎండలొ ఎండబెట్టి పొడి చేసుకుని దానిని రోజు పరగడుపున గ్లాసు పెరుగులో రెండు స్పూన్ల మోతాదులో కలుపుకొని తాగుతూ ఉంటే కిడ్నీలో ఉన్న రాళ్లు,మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి. జుట్టు రాలడం చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు దీని ఆకుల నుంచి ముళ్ళు తీసివేసి ఆకులను దంచి రసం తీసుకొని తలకు బాగా మర్దన చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమె
కాక జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.